Vignesh Shivan : నయనతార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలకు ఓకే చెప్పింది. అయితే నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడు చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికి తెర దించుతూ ఎట్టకేలకు ఇటీవలే నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అప్పుడే ఈ జంట 2 హనీమూన్లు కూడా కంప్లీట్ చేసేసుకున్నారు.
అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బర్త్ డే ను దుబాయిలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు విగ్నేశ్ శివన్. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. నీతో నేను కలిసి జరుపుకుంటున్న 8వ పుట్టినరోజు ఇది. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు నేను నీతో మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను అంటూ ప్రపంచంలోనే ఎత్తైన భవనం గా పేరున్న బుర్జా ఖలీఫ్ ముందు కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా దుబాయిలో ఓ మాల్ లో నయన్, విగ్నేష్ గడిపిన సరదా క్షణాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. అక్కడే ఉన్న ముగ్గురు పిల్లలతో ఫోటో దిగి ఆ ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేస్తూ.. భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. కొందరు ఎప్పుడో పుట్టబోయే పిల్లల కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీసా.. ఇలాంటి ప్రాక్టీస్ మేమెప్పుడూ చూడలేదు అంటుంటే, మరి కొందరు మీరు ఎప్పుడూ ఇలాగే పిల్లలతో సరదాగా ఉండాలని కోరుకుంటున్నాం.. త్వరలోనే నయన్ గుడ్ న్యూస్ చెబుతుందని ఆశిస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…