OTT : వారం మారుతున్న కొద్దీ కొత్త కొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా థియేటర్ల కన్నా ఓటీటీల్లోనే సినిమాలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే యాప్‌లు కూడా రీసెంట్‌గా రిలీజ్ అవుతున్న మూవీలను వీలైనంత త్వరగా తమ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా పలు మూవీలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇక ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. దీన్ని సోనీ లివ్‌లో సెప్టెంబర్ 28 నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. అలాగే మార్లిన్ మన్రో జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన బ్లాండె అనే మూవీని ఈ నెల 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుంది.
ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ నటించిన బుల్లెట్ ట్రెయిన్ అనే మూవీ జీ5 యాప్ లో స్ట్రీమ్ కానుంది. ఈ నెల 29న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఆర్య నటించిన కెప్టెన్ అనే మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా ఈ మూవీని జీ5 యాప్ లో ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇలా పలు మూవీలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అయితే తెలుగు సినిమాలు మాత్రం ఈ వారం ఓటీటీల్లో ఏమీ లేవు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…