OTT : ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న మూవీలు ఇవే..!

September 26, 2022 11:05 AM

OTT : వారం మారుతున్న కొద్దీ కొత్త కొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా థియేటర్ల కన్నా ఓటీటీల్లోనే సినిమాలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే యాప్‌లు కూడా రీసెంట్‌గా రిలీజ్‌ అవుతున్న మూవీలను వీలైనంత త్వరగా తమ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా పలు మూవీలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళ స్టార్‌ నటుడు చియాన్‌ విక్రమ్‌ నటించిన కోబ్రా మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇక ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది. దీన్ని సోనీ లివ్‌లో సెప్టెంబర్‌ 28 నుంచి స్ట్రీమ్‌ చేయనున్నారు. అలాగే మార్లిన్‌ మన్రో జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన బ్లాండె అనే మూవీని ఈ నెల 28వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అవుతుంది.

movies releasing on OTT apps on September  30th 2022
OTT

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌ పిట్‌ నటించిన బుల్లెట్‌ ట్రెయిన్‌ అనే మూవీ జీ5 యాప్ లో స్ట్రీమ్‌ కానుంది. ఈ నెల 29న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నారు. ఆర్య నటించిన కెప్టెన్‌ అనే మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరచగా ఈ మూవీని జీ5 యాప్ లో ఈ నెల 30వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. ఇలా పలు మూవీలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అయితే తెలుగు సినిమాలు మాత్రం ఈ వారం ఓటీటీల్లో ఏమీ లేవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now