Vignesh Shivan : పిల్లల కోసం వెరైటీ ప్రాక్టీస్ చేస్తున్నార‌ట‌.. విగ్నేశ్ శివ‌న్ కామెంట్స్ వైర‌ల్‌..

September 26, 2022 12:37 PM

Vignesh Shivan : నయనతార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలకు ఓకే చెప్పింది. అయితే నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడు చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికి తెర దించుతూ ఎట్టకేలకు ఇటీవలే నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అప్పుడే ఈ జంట 2 హనీమూన్లు కూడా కంప్లీట్ చేసేసుకున్నారు.

అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బర్త్ డే ను దుబాయిలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు విగ్నేశ్ శివన్. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. నీతో నేను కలిసి జరుపుకుంటున్న 8వ పుట్టినరోజు ఇది. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు నేను నీతో మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను అంటూ ప్రపంచంలోనే ఎత్తైన భవనం గా పేరున్న బుర్జా ఖలీఫ్ ముందు కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Vignesh Shivan latest comments on nayanthara netizen reaction
Vignesh Shivan

ఈ సందర్భంగా దుబాయిలో ఓ మాల్ లో నయన్, విగ్నేష్ గడిపిన సరదా క్షణాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. అక్కడే ఉన్న ముగ్గురు పిల్లలతో ఫోటో దిగి ఆ ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేస్తూ.. భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. కొందరు ఎప్పుడో పుట్టబోయే పిల్లల కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీసా.. ఇలాంటి ప్రాక్టీస్ మేమెప్పుడూ చూడలేదు అంటుంటే, మరి కొందరు మీరు ఎప్పుడూ ఇలాగే పిల్లలతో సరదాగా ఉండాలని కోరుకుంటున్నాం.. త్వరలోనే నయన్ గుడ్ న్యూస్ చెబుతుందని ఆశిస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now