Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈయన పలువురి జాతకాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అప్పట్లో ఈయన జగన్ సీఎం అవుతారని చెప్పారు. అది జరిగింది. అలాగే సమంత, నాగచైతన్య విడిపోతారని కూడా చెప్పారు. అది కూడా నిజమైంది. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలకు బలం చేకూరినట్లు అయింది. ఈ క్రమంలోనే ఆయన జాతకాన్ని కూడా చాలా మంది బలంగా నమ్మడం మొదలు పెట్టారు. ఇక ఈమధ్య కూడా ఆయన నరేష్ వైవాహిక జీవితంపై వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో తాను సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో తరచూ పూజలు చేసేవాడినని తెలిపారు. అయితే నరేష్, రమ్య రఘుపతిల జాతకాలను చూసి వారికి పెళ్లి చేయవద్దని కోరానని.. చేసినా కూడా వారు విడిపోతారని చెప్పానని.. అన్నారు. తాను అన్నట్లుగానే వారు విడిపోయారని.. అయితే అప్పట్లో వారి మేలు కాంక్షించే ఆ విషయం చెప్పానని.. కానీ వారు తప్పుగా అర్థం చేసుకున్నారని.. అప్పటి నుంచి వారి ఇంటికి వెళ్లడం లేదని.. వేణు స్వామి తెలియజేశారు. అయితే ఆయన చెప్పినట్లుగానే నరేష్ తన భార్య రమ్య రఘుపతితోనూ విడిపోయారు. ఈ క్రమంలోనే వేణు స్వామి జాతకంపై అందరికీ గురి కుదురుతోంది.
ఇక వేణు స్వామి తాజాగా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు నార్త్, ఇటు సౌత్‌లో దూసుకుపోతున్న నయనతార, రష్మిక మందన్న, పూజా హెగ్డెలు పెళ్లి చేసుకున్నా వారు విడాకులు తీసుకుంటారని అన్నారు. ఈ ముగ్గురికీ 2024 బాగుందని.. ఆ తరువాత సమస్యలు వస్తాయని తెలిపారు. కాగా నయనతారకు ఇప్పటికే పెళ్లి అయింది. ఇటీవలే ఆమె దర్శకుడు విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. ఇక రష్మిక మందన్న గతంలో పెళ్లి క్యాన్సిల్ చేసింది. దీంతో ఆమెకు, పూజా హెగ్డెకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే వీరు పెళ్లి చేసుకున్నా విడిపోతారని, విడాకులు తీసుకుంటారని.. వేణు స్వామి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. మరి ఆయన చెప్పినట్లు వారి జాతకాల్లో జరుగుతుందో.. లేదో.. చూడాలి.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…