Venu Swamy : ఆ ముగ్గురు హీరోయిన్ల‌కు విడాకులు త‌ప్ప‌వ‌ట‌.. వేణు స్వామి సంచ‌ల‌న కామెంట్స్‌..

July 27, 2022 10:06 PM

Venu Swamy : ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఈమ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. గ‌తంలో ఈయ‌న ప‌లువురి జాత‌కాల గురించి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. అప్ప‌ట్లో ఈయన జ‌గ‌న్ సీఎం అవుతార‌ని చెప్పారు. అది జ‌రిగింది. అలాగే స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోతార‌ని కూడా చెప్పారు. అది కూడా నిజ‌మైంది. దీంతో వేణు స్వామి వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లు అయింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జాత‌కాన్ని కూడా చాలా మంది బ‌లంగా న‌మ్మ‌డం మొద‌లు పెట్టారు. ఇక ఈమ‌ధ్య కూడా ఆయ‌న న‌రేష్ వైవాహిక జీవితంపై వ్యాఖ్య‌లు చేశారు.

అప్ప‌ట్లో తాను సూప‌ర్ స్టార్ కృష్ణ ఇంట్లో త‌ర‌చూ పూజ‌లు చేసేవాడిన‌ని తెలిపారు. అయితే న‌రేష్‌, ర‌మ్య ర‌ఘుప‌తిల జాత‌కాల‌ను చూసి వారికి పెళ్లి చేయ‌వ‌ద్ద‌ని కోరాన‌ని.. చేసినా కూడా వారు విడిపోతార‌ని చెప్పాన‌ని.. అన్నారు. తాను అన్న‌ట్లుగానే వారు విడిపోయార‌ని.. అయితే అప్ప‌ట్లో వారి మేలు కాంక్షించే ఆ విష‌యం చెప్పాన‌ని.. కానీ వారు త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని.. అప్ప‌టి నుంచి వారి ఇంటికి వెళ్ల‌డం లేద‌ని.. వేణు స్వామి తెలియ‌జేశారు. అయితే ఆయ‌న చెప్పిన‌ట్లుగానే న‌రేష్ త‌న భార్య ర‌మ్య ర‌ఘుప‌తితోనూ విడిపోయారు. ఈ క్ర‌మంలోనే వేణు స్వామి జాత‌కంపై అంద‌రికీ గురి కుదురుతోంది.

Venu Swamy said that those actresses will get divorce
Venu Swamy

ఇక వేణు స్వామి తాజాగా మ‌ళ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అటు నార్త్‌, ఇటు సౌత్‌లో దూసుకుపోతున్న న‌య‌న‌తార‌, ర‌ష్మిక మంద‌న్న‌, పూజా హెగ్డెలు పెళ్లి చేసుకున్నా వారు విడాకులు తీసుకుంటార‌ని అన్నారు. ఈ ముగ్గురికీ 2024 బాగుంద‌ని.. ఆ త‌రువాత స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలిపారు. కాగా న‌య‌న‌తార‌కు ఇప్ప‌టికే పెళ్లి అయింది. ఇటీవ‌లే ఆమె ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ను వివాహం చేసుకుంది. ఇక ర‌ష్మిక మంద‌న్న గ‌తంలో పెళ్లి క్యాన్సిల్ చేసింది. దీంతో ఆమెకు, పూజా హెగ్డెకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే వీరు పెళ్లి చేసుకున్నా విడిపోతారని, విడాకులు తీసుకుంటార‌ని.. వేణు స్వామి కామెంట్స్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఆయ‌న చెప్పిన‌ట్లు వారి జాత‌కాల్లో జ‌రుగుతుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now