Trivikram : పుష్ప సినిమా సక్సెస్ కారణంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ క్రమంలోనే ఆయనను హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు బాలీవుడ్ నిర్మాతలు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ వారి కల ఇప్పుడప్పుడే నెరవేరదు. ఎందుకంటే బన్నీ ఇప్పటికే తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ కావడంతో అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి ఆయనతో యాడ్స్ చేసేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బన్నీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారాడు. అనేక యాడ్స్‌లోనూ నటిస్తున్నాడు. ఇక తాజాగా మరో కంపెనీకి చెందిన యాడ్‌లోనూ బన్నీ నటించాడు. ఈ క్రమంలోనే ఆ యాడ్‌కు గాను బన్నీ ధరించిన దుస్తులకు చెందిన ఫొటో వైరల్ అవుతోంది.
ఈ మధ్యే హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ ఒక యాడ్ చేయగా.. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో యాడ్ చేశాడు. ఈ యాడ్ షూటింగ్ కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. అందులో భాగంగానే యాడ్ కోసం అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. తలపై టోపీ ధరించాడు. ఇక ఈ యాడ్ త్వరలోనే ప్రసారం కానుంది. అయితే ఈ యాడ్ కు దర్శకత్వం వహించినందుకు గాను త్రివిక్రమ్ అక్షరాలా రూ.45 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట. అది కూడా కొన్ని సెకన్ల యాడేనట. కానీ భారీ మొత్తంలో త్రివిక్రమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లో రాజమౌళి తరువాత అంతటి భారీ మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటున్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరని చెప్పవచ్చు.
కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బన్నీ చేసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఆయనతో బన్నీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో తదితర సినిమాల్లో నటించాడు. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్‌లో ఉన్నారు. ఈ మూవీ అనంతరం బన్నీ త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్‌తో సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక బన్నీతో సినిమా ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…