గురువారం, జూన్ 11, 2026
జ్యోతిష్యం & వాస్తు

Vastu Tips : నెమ‌లి ఈక‌ల‌తో ఈ విధంగా చేయండి.. అన్ని క‌ష్టాలు పోయి ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది..!

Vastu Tips : సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. స‌మ‌స్య‌లు లేని వారు అస్స‌లు ఉండ‌రు. అయితే కొంద‌రికి మాత్రం అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతుంటాయి. వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌లేక‌పోతుంటారు. అందుకు వాస్తు…

Vastu Tips : నెమ‌లి ఈక‌ల‌తో ఈ విధంగా చేయండి.. అన్ని క‌ష్టాలు పోయి ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది..!

Vastu Tips : సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. స‌మ‌స్య‌లు లేని వారు అస్స‌లు ఉండ‌రు. అయితే కొంద‌రికి మాత్రం అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతుంటాయి. వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌లేక‌పోతుంటారు. అందుకు వాస్తు దోషం కార‌ణ‌మ‌వుతుంటుంది. కానీ నెమ‌లి ఈక‌ల‌ను కింద తెలిపిన విధంగా ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల అన్ని వాస్తు దోషాలు తొల‌గిపోతాయి. క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతారు. ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ధ‌నం, ఆరోగ్యం అన్నీ ల‌భిస్తాయి. మ‌రి అందుకు నెమ‌లి ఈక‌ల‌ను ఎలా ఉప‌యోగించాలంటే..

Vastu Tips keep peacock feather in your home in this way for wealth and luck
Vastu Tips

ఇంట్లో మీరు ధ‌నం, బంగారం ఉంచే చోట ఒక నెమలి ఈక‌ను పెట్టాలి. లాక‌ర్ అయితే ఇంకా మంచిది. ఇంట్లో ఒక లాక‌ర్ పెట్టి అందులో డ‌బ్బు, ధ‌నం, ఇత‌ర విలువైన వ‌స్తువులు, ప‌త్రాల‌ను ఉంచాలి. వాటి ప‌క్క‌నే ఒక నెమ‌లి ఈక‌ను పెట్టి లాకర్‌కు తాళం వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ నెమ‌లి ఈక ధ‌నాన్ని ఆక‌ర్షిస్తుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి.

అలాగే ఆఫీస్‌లో లేదా వ్యాపారం చేసేవారు తాము ఉండే కార్యాల‌యంలో నెమ‌లి ఈక‌ను ఎవ‌రూ చూడ‌ని చోట ఒక గ‌దిలో ఉంచాలి. దీంతో ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుని రాణిస్తారు.

ఇక ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఏదైనా అలంక‌ర‌ణ వ‌స్తువులో నెమ‌లి ఈక‌ను ఉంచి క‌ట్టాలి. దీంతో ఇంట్లోకి దుష్ట శ‌క్తులు, నెగెటివ్ ఎన‌ర్జీ రాకుండా ఉంటాయి. దీని వ‌ల్ల ఇంట్లోని వారికి స‌మ‌స్య‌లు త‌ప్పుతాయి. ఏ ప‌నిచేసినా విజ‌యం ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి