Udayabhanu : బుల్లితెరపై ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు బిగ్ బాస్ 6 సిద్ధమవుతోంది. ఈ సీజన్ గురించి ఇది వరకే ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్లను బిగ్ బాస్ 6కు నేరుగా తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే మిగిలిన కంటెస్టెంట్ల కోసం ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే ఈ సీజన్‌ను ప్రారంభించనున్నారు. అయితే ఈ సారి సీజన్‌లో సీనియర్ యాంకర్ ఉదయ భాను ను తీసుకోవాలని నిర్వాహకులు చూస్తున్నారట.
యాంకర్ ఉదయభాను ప్రస్తుతం ఎలాంటి షోస్, సినిమాలు చేయడం లేదు. కానీ ఆమెకు పాపులారిటీ బాగానే ఉంది. ఆమె మాటలు, యాంకరింగ్ ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. ఆమె షోలో ఉంటే కళ వస్తుంది. ఎంతగానో అలరించగలదు. కనుకనే ఆమెకు ఎంత రెమ్యునరేషన్ అయినా సరే ఇచ్చి బిగ్ బాస్ లోకి రప్పించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు భారీ మొత్తం ఆఫర్ చేశారని కూడా తెలుస్తోంది. అయితే ఆమె అందుకు ఓకే చెప్పిందా.. లేదా.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు.
ఇక ఉదయభాను యాంకర్‌గానే కాక సినిమాల్లోనూ నటించి అలరించింది. ఈమె రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమాలో రాజశేఖరా.. అంటూ ప్రత్యేక పాటలోనూ నర్తించి ఆకట్టుకుంది. అయితే ఈమె బిగ్ బాస్‌లో పాల్గొంటే కచ్చితంగా రేటింగ్స్ వస్తాయని చెప్పవచ్చు. కనుకనే ఈమె కోసం నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ షో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…