Tollywood : షాకింగ్.. విడాకుల‌కి సిద్ధ‌మ‌వుతున్న మ‌రో యంగ్ హీరో…!

October 10, 2021 10:50 AM

Tollywood : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకుల పర్వం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీలు ప్రేమించి పెళ్ళి చేసుకుని కలిసి ఉండి విడిపోతున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీల దగ్గర్నుండి టాలీవుడ్ వరకు ఎంతో మంది తమ వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నారు. టాలీవుడ్ లో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన సమంత, నాగచైతన్యలు విడాకుల సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులంటూ ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. పదేళ్ళ ప్రేమ బంధంతో.. నాలుగేళ్ళ వివాహ బంధంలో ఎంతో హాయిగా ఉన్న ఈ బ్యూటీఫుల్ కపుల్ విడాకులు ఎంతో మంది అభిమానులపై ప్రభావాన్ని చూపించాయి.

Tollywood another young hero preparing for divorce

అలాగే రీసెంట్ గా ఓ బిగ్ షాట్ కూతుర్ని పెళ్ళి చేసుకున్న ఓ యంగ్ హీరో కూడా త్వరలో తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. తమ వైవాహిక జీవితం సరిగ్గా లేదంటూ సోషల్ మీడియాలో విపరీతమైన గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ఎవ్వరికీ తెలీదు. అయితే ఈ యంగ్ హీరో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఈవెంట్స్ లో కూడా కనిపించకపోవడం మరింత అనుమానాల్ని రేకెత్తిస్తుంది.

ఈ హీరో రెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే అతని పర్సనల్ ఇష్యూస్ వల్లే సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇంకా లేట్ అవుతోంది. ఇక ఈ జంట విడాకులపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. కానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీరి విడాకులు ఖరారైతే సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నట్లే అనుకోవాలి. ఏది ఏమైనా వివాహ బంధం అనేది ఎంతో పవిత్రమైంది. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం సాగించాల్సిన బంధం. అలాంటి బంధానికి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేయడం బాధాకరమనే అనుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment