The Ghost Movie OTT : అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ దసరా కానుకగా 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా ఈ సినిమాలో నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ దసరా పండగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాగార్జున కూడా ఈ మూవీతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని తెగ ముచ్చట పడ్డాడు.
విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంతో పోటీపడిన ఈ మూవీ మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇదిగా ఉండగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయిటకు వచ్చింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ది ఘోస్ట్ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. అయితే ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా చిత్ర యూనిట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందట. నాగ్ సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా గుల్ పనాగ్, మనీష్ చౌదరి, రవి వర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…