The Ghost Movie OTT : నాగార్జున ది ఘోస్ట్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

October 6, 2022 11:09 AM

The Ghost Movie OTT : అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ దసరా కానుకగా 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించగా ఈ సినిమాలో నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ మూవీ ద‌స‌రా పండ‌గ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. నాగార్జున కూడా ఈ మూవీతో సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాల‌ని తెగ ముచ్చ‌ట ప‌డ్డాడు.

విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంతో పోటీపడిన ఈ మూవీ మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇదిగా ఉండగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయిటకు వచ్చింది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ది ఘోస్ట్ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

The Ghost Movie OTT details know the app and streaming
The Ghost Movie OTT

ఈ సినిమా రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. అయితే ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా చిత్ర యూనిట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందట. నాగ్ సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా గుల్ పనాగ్, మనీష్ చౌదరి, రవి వర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now