Chiranjeevi : చిరంజీవిని అవమానిస్తే ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పిన దర్శకుడు ఎవరో తెలుసా..?

November 16, 2022 9:27 PM

Chiranjeevi : తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త నడక నేర్పిన నటులు ఎవరు అనే ప్రశ్న తలెత్తితే.. ఎవరైనా ఏమాత్రం తడుముకోకుండా  మొదటిగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన డైలాగ్ డెలివరీ, ట్రెండ్ సెట్ చేసిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇంకా చెప్పాలి అంటే ఆయన పరిచయం చేసిన డాన్స్ స్టైల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నూతన అధ్యయనాన్ని లిఖించాయి. 66 ఏళ్ల వయసులో కూడా కుర్రకారుకు జోష్ తెప్పించే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు మెగాస్టార్.

చిరంజీవి తన కెరీర్ మొదలు నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకునేవారు. మెగాస్టార్ తన సినీ కెరిర్ లో దాదాపు అన్ని రకాల పాత్రలను పోషించారు. అలా ఎన్నో వైవిద్య భరితమైన  చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  సంపాదించుకున్నారు చిరంజీవి.  అలా కథకు ప్రాధాన్యత ఇచ్చి చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం 1982 ఏప్రిల్ 23న వేసవి బరిలో దిగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రంగాను కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.

that director told Chiranjeevi insulted movie become hit
Chiranjeevi

ఈ సినిమా కోసం ముందుగా కోడి రామకృష్ణ  ప్రముఖ నిర్మాత అయిన కె.రాఘవ వద్దకు వెళ్లారు. కోడి రామకృష్ణ ఊహించని విధంగా ఆయన స్పందించారు.  మనకు చాలా మంచి స్టార్ హీరోలు ఉండగా చిరంజీవిని ఎందుకు ఈ సినిమాకు ఎంపిక చేసావు అని అడిగారట. అప్పుడు కోడి రామకృష్ణ ఇలా బదులు చెప్పారట. నా సినిమా లో కథకు తగ్గట్టుగా చిరంజీవి మాత్రమే బాగుంటారు అని సమాధానమిచ్చారట కోడి రామకృష్ణ.

మర్నాడు ప్రొడక్షన్ పెద్దలతో మీటింగ్ పెట్టి వారి మధ్య కోడి రామకృష్ణను నిలబెట్టి మరి నిలదీసి అడిగారట  కె.రాఘవ.  ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. నా సినిమాలో భార్య భర్తని అవమానిస్తుంది. బాగా నిలదీస్తుంది. ఆ పాత్రలో చిరంజీవి ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. కథ చాలా కొత్తగా ఉంటుంది అని కన్విన్స్ చేశారట కోడి రామకృష్ణ. దర్శకుడు సమాధానంతో ఈ మీటింగ్ తరువాత  చిరంజీవి అయితేనే ఈ కథకు కరెక్ట్ గా సరిపోతాడు అని భావించి నిర్మాతలు ఒకే చెప్పారు. అలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం తెరపైకి వచ్చి  బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now