Thaggedele : త‌గ్గేదేలే.. డైలాగ్‌.. పుష్ప 2లో ఉండ‌దు.. ఎందుకో తెలుసా..?

June 24, 2022 7:34 AM

Thaggedele : ద‌ర్శ‌కుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్‌తోపాటు ర‌ష్మిక మంద‌న్న న‌టించింది. అలాగే సునీల్ నెగెటివ్ రోల్‌లో అద‌ర‌గొట్టాడు. అయితే వీరంద‌రూ ఈ మూవీలో డి-గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపించారు. అయిన‌ప్ప‌టికీ వారి లుక్స్ అదిరిపోయాయి. ఇక పుష్ప చిత్రంలోని పాట‌లు, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. బ‌న్నీతోపాటు ర‌ష్మిక మ్యాన‌రిజంను కూడా ప్రేక్ష‌కులు అనుక‌రిస్తున్నారు. పుష్ప చిత్రంలోని పాట‌లు, డైలాగ్స్ ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

ఇక పుష్ప మూవీలో అల్లు అర్జున్ త‌గ్గేదేలే.. డైలాగ్ చెప్పి అంద‌రినీ ఎంత‌గానో ఉత్తేజ‌ప‌రిచాడు. త‌న ప్ర‌తి సినిమాకు బ‌న్నీ ఏదో ఒక డైలాగ్ లేదా మ్యాన‌రిజంను మెయింటెయిన్ చేయ‌డం అల‌వాటు. రేసు గుర్రంలో ద్యావుడా.. అనే కామెడీ డైలాగ్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఆ త‌రువాత పుష్ప‌లోని త‌గ్గేదేలే.. డైలాగ్ కూడా అంతే పాపుల‌ర్ అయింది. దీన్ని చాలా మంది ఇప్ప‌టికీ వాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు. అయితే పుష్ప చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన త‌గ్గేదేలే డైలాగ్‌ను పుష్ప 2 లో పెట్ట‌డం లేద‌ట‌. అవును.. త‌గ్గేదేలే అనే డైలాగ్ కేవ‌లం మొద‌టి పార్ట్ సినిమాకే ప‌రిమిత‌మ‌ని చెబుతున్నారు.

Thaggedele dialogue will not be there in Pushpa 2 movie
Thaggedele

పుష్ప 2 చిత్రంలో త‌గ్గేదేలే డైలాగ్ కాకుండా ఇంకో కొత్త డైలాగ్‌, మ్యాన‌రిజంను పెట్టాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆలోచిస్తున్నార‌ట‌. అందుక‌నే బ‌న్నీ చిత్తూరు యాస‌కు చెందిన కొన్ని డైలాగ్స్‌ను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడ‌ట‌. అందువ‌ల్ల పుష్ప 2 లో మ‌న‌కు త‌గ్గేదేలే అనే డైలాగ్ వినిపించ‌ద‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతానికి ఇది ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచార‌మే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

కాగా పుష్ప 2 చిత్రం షూటింగ్ ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంద‌ని మేక‌ర్స్ ఒక హింట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం సుకుమార్ స్క్రిప్టును సిద్ధం చేసే ప‌నితోపాటు సినిమాకు గాను అవ‌స‌ర‌మైన న‌టీన‌టుల‌ను ఎంపిక చేసే కాస్టింగ్ ప్ర‌క్రియ‌ను కూడా ఒకేసారి చేస్తున్నార‌ట‌. దీంతో త్వ‌ర‌లోనే పుష్ప 2 షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment