దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ కరోనా రక్కసి ఏకంగా కుటుంబాలపై పంజా విసిరి కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంటుంది. ఈ మహమ్మారి బారిన పడి ఓ వ్యక్తి ఏకంగా నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రాణాలు దక్కించుకో లేకపోయాడు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్‌బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకొని అక్కడ సిమెంట్, ఐరన్ వ్యాపారంతో పాటు జిమ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా రాజన్ బాబు తన భార్య ,ఇద్దరు పిల్లలు కరోనా భారినపడగా అందరూ
క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే రాజన్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో అతనికి చికిత్స నిమిత్తం నగరంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.అన్ని ఆస్పత్రులలో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేశారు. రాజన్ బాబు చికిత్స కోసం ఫ్లాట్ ను కూడా అమ్మేసి చికిత్స అందించారు. సుమారు నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ అతని ప్రాణాలు కోల్పోయాడు. రాజన్ బాబు మాత్రమే కాకుండా తన తల్లి, సోదరి సైతం ప్రాణాలు కోల్పోగా భార్య పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. ఈ విధంగా కరోనా మహమ్మారికి కుటుంబం మొత్తం బలి కావడంతో రాజన్ భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…