ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. తరువాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను అందుబాటులోకి తెచ్చారు. నల్ల ధనాన్ని బయటకు తీసేందుకు, దొంగ నోట్లను అరికట్టేందుకు, భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే ఆ లక్ష్యాలు నెరవేరాయో లేదో తెలియదు కానీ రూ.2000 నోటు గురించి ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ షాకింగ్ వార్తలను చెబుతూ వస్తోంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 నోట్లను సరఫరా చేయడం లేదని ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. 2019లోనే రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేశామని చెప్పిన ఆర్‌బీఐ ఇప్పుడు తాజాగా ఈ విషయం వెల్లడించడం షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అత్యధిక విలువ కలిగిన నోటు రూ.2000 నోటు కాగా ఈ నోట్లు ప్రస్తుతం సరఫరా కావడం లేదు.
ఆర్‌బీఐ 2021 వార్షిక నివేదిక ప్రకారం దేశంలో రూ.500, రూ.2000 నోట్ల శాతం 85.7 గా ఉంది. 2020 ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం 2018 మార్చి వరకు దేశంలో 33,632 లక్షల రూ.2000 నోట్లు చెలామణీలో ఉండగా మార్చి 2019 వరకు అది 32,910 లక్షలకు తగ్గింది. 2020 చివరి వరకు దేశంలో చెలామణీలో ఉన్న రూ.2000 నోట్ల సంక్య 27,398కు చేరుకుంది. ఈ క్రమంలోనే చెలామణీలో ఉన్న రూ.2000 నోట్ల సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…