వినోదం

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

‘ధురంధర్ 2’ చిత్రాన్ని ఎండ్యూరెన్స్ టెస్ట్‌గా అభివర్ణించిన నటి రమ్య స్పందన. Photo Credit: Ramya Spandana/Aditya Dhar/Instagram/X.

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2 చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సినిమాను ఆమె ఎండ్యూరెన్స్ టెస్ట్ గా అభివర్ణించడంతోపాటు భారీ నిరాశ క‌లిగించింద‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమాలో చూపించిన అనవసర హింసపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాను చూడ‌కుండా ఎవ‌రికి వారు ఉప‌కారం చేసుకోవాల‌ని ఆమె అన్నారు. థియేట‌ర్‌లో స‌మ‌యం, డ‌బ్బు వృథా చేసుకోవ‌ద్ద‌ని, ఇది పూర్తిగా పాజ్ చేయాల్సిన సినిమా అని, మ‌న జీవితంలోని నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించే కంటెంట్ క‌లిగిన మూవీ అని, ఎప్పుడైనా ఖాళీగా ఉన్న స‌మ‌యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టైమ్ పాస్ కోసం మాత్ర‌మే ఈ సినిమాను చూడాల‌ని ఆమె అన్నారు.

హింస‌నే సినిమాగా చూపించారు..

రణవీర్ ఈ సినిమాను మోస్తున్నాడని చెప్పేవారందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాన‌ని ర‌మ్య స్పంద‌న అన్నారు. అతను ఏం మోస్తున్నాడు? నాకు కనిపించింది అతని జుట్టు మాత్రమే. మొదటి భాగంలో అతని జుట్టుకి వ్యక్తిత్వం, ప్రెజెన్స్, పాత్ర ఉండేది. ఈ భాగంలో అది కేవలం అన్నింటికీ అడ్డుగా ఉంది. సీన్లను కప్పేస్తోంది. సపోర్టింగ్ రోల్ నామినేషన్‌కు కూడా అర్హత ఉండొచ్చు.. అని ఆమె అన్నారు. సినిమాలో హింసను గురించి ఆమె మరింత తీవ్రంగా స్పందించారు. ఇది సినిమా కాదు, ఎలాంటి వస్తువునైనా ఎంత సృజనాత్మకంగా హింసాత్మకంగా ఉపయోగించవచ్చో చూపించే ఒక విజువల్ హ్యాండ్‌బుక్‌లా ఉంది. అది అసలు ఉండకూడదు. సిరంజ్ వాడారు. స్పానర్ వాడారు. కత్తులు, ముళ్ల బంతులు, మాచెట్లు, రీపర్లు, గొలుసులు, గన్స్, బాంబులు, బజూకాలు, షట్టర్లు.. ఏది చెప్పినా దాన్ని ఆయుధంగా మార్చేశారు.. అని ఫైర‌య్యారు.

బోరింగ్‌గా, కామెడీగా ఉంది..

ఆమె ఇంకా కొనసాగిస్తూ.. దర్శకుడు తనతోనే ఒక పోటీలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. తర్వాతి సీన్‌ను ఇంకాస్త హింసాత్మకంగా లేదా కామెడీగా ఎలా చేయాలి? అని ఆలోచించి తీసిన‌ట్లున్నారు. అది చివరికి షాక్ ఇవ్వడం మానేసి హాస్యాస్పదంగా మారింది. ఇద్దరి కాళ్లు కోసినా, శరీరాన్ని కిరోసిన్‌లో ముంచినా, ఆ వ్యక్తి ఇంకా TED టాక్ ఇస్తున్నట్టు డైలాగులు చెబుతాడు. మెడికల్ సైన్స్‌కు జై. ఆస్కార్ మరిచిపోండి, నోబెల్ ప్రైజ్ సిద్ధంగా ఉంది.. అని ఆమె వ్యంగ్యంగా పేర్కొన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ధురంధర్ 2 ఒక భారీ నిరాశ. బోరింగ్ లేదా కామెడీగా మాత్రమే అనిపిస్తుంది. మొదటి భాగం మీకు ఆనందాన్ని ఇచ్చి ఉంటే, ఈ రెండో భాగం ఎందుకు అని మీరు ప్రశ్నించేలా చేస్తుంది. రణవీర్, మీరు దీనికంటే మెరుగైనవారు. ఆదిత్య ధర్.. జింగోయిజం, ప్రొపగాండా ఇప్పుడు పాతవే. వాటిని దాటండి.. అని ఆమె చెప్పుకొచ్చారు.

బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్లు..

ఇదిలా ఉండగా, రణవీర్ సింగ్ నటించిన ధురంధర్‌కు సీక్వెల్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. విడుదల రోజునే రూ.102.55 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. మార్చి 18, 2026న జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా మాత్రమే భారత్‌లో రూ.43 కోట్లు రాబట్టింది, కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు అయినప్పటికీ, ఆలస్యాలు ఉన్నప్పటికీ ఈ వసూళ్లు సాధించింది. మార్చి 20 నాటికి భారత్‌లో మొత్తం కలిపి రూ.145.55 కోట్లు వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రివ్యూల ద్వారా సుమారు రూ.75 కోట్లు (గ్రాస్) వసూలయ్యాయి. మొదటి రోజు అనంతరం మొత్తం కలిపి రూ.240 కోట్లకు చేరుకుంది. అందులో ఒక్క రోజులోనే రూ.165 కోట్లు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. సాక్‌నిల్క్ ప్రకారం, ఓపెనింగ్ డేలో రూ.102.55 కోట్లు రాగా, అందులో హిందీ వెర్షన్ నుంచే రూ.99.10 కోట్లు వచ్చాయి. టెక్నికల్ సమస్యలు, కంటెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల పెయిడ్ ప్రివ్యూలు జరగని కన్నడ, మలయాళ వెర్షన్లు వరుసగా రూ.0.8 కోట్లు, రూ.0.9 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. తమిళ వెర్షన్ భారత్‌లో 958 షోల ద్వారా రూ.1.16 కోట్లు సంపాదించింది. తెలుగు వెర్షన్ మొత్తం రూ.2.12 కోట్లు వసూలు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM