క్రికెట్

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

తన పెళ్లి వేడుకలో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు పాదాభివందనం చేస్తున్న కుల్దీప్ యాదవ్. Photo Credit: Social Media/X.

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన రిసెప్ష‌న్‌కు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా త‌న భార్య రివాబాతో హాజ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. కుల్దీప్ యాద‌వ్ వివాహం మార్చి 14, 2026న ఉత్త‌రాఖండ్‌లోని ముస్సూరీలో జ‌రిగింది. ఆ వివాహానికి కేవ‌లం కొద్దిమంది స్నేహితులు, కుటుంబ స‌భ్యులు, బంధువులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అయితే రిసెప్ష‌న్‌ను మాత్రం గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ల‌క్నోలోని ది సెంట్ర‌మ్ వేదిక‌గా నిర్వ‌హించిన రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మానికి స‌హ‌చ‌ర క్రికెటర్ల‌తోపాటు ప‌లువురు రాజ‌కీయ రంగానికి చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక ర‌వీంద్ర జ‌డేజా త‌న భార్య రివాబాతో క‌లిసి పాల్గొని నూత‌న దంప‌తుల‌ను వేదిక‌పై ఆశీర్వ‌దించ‌గా ఆ దృశ్యాల‌కు చెందిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. అందులో కుల్దీప్ యాద‌వ్ ర‌వీంద్ర జ‌డేజా దంపతుల కాళ్ల‌కు న‌మ‌స్కారం చేస్తూ క‌నిపించాడు. దీంతో కుల్దీప్ సంస్కారానికి ఆయ‌న ఫ్యాన్స్‌, నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

కుల్దీప్ యాద‌వ్‌పై నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

కుల్దీప్ యాద‌వ్ వివాహం, రిసెప్ష‌న్‌కు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. కానీ ర‌వీంద్ర జ‌డేజా దంప‌తుల‌కు అత‌ను పాదాభివంద‌నం చేసిన వీడియో మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తోంది. వాస్త‌వానికి ర‌వీంద్ర జ‌డేజా వ‌య‌స్సులో పెద్ద‌వాడు. క‌నుక అత‌ని కాళ్ల‌కు, అత‌ని భార్య పాదాల‌కు న‌మ‌స్కారం చేయాలి. దాన్నే కుల్దీప్ పాటించాడు. దీంతో కుల్దీప్ చేసిన చ‌ర్య‌కు నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. సంప్ర‌దాయాల‌ను గౌర‌వించ‌డంపై కుల్దీప్‌ను ప్ర‌శంసిస్తున్నారు. ఇక ఈ రిసెప్ష‌న్‌ వేడుక‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాదవ్‌, భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌, తోటి క్రికెట‌ర్లు య‌శ‌స్వి జైశ్వాల్‌, రిష‌బ్ పంత్‌, మాజీ ప్లేయ‌ర్ శిఖ‌ర్ ధావన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

శిఖ‌ర్ ధావ‌న్ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు..

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శిఖ‌ర్ ధావ‌న్ కుల్దీప్ యాద‌వ్ రిసెప్ష‌న్‌కు తాను హాజ‌రైన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ సంద‌ర్భంగా నూత‌న దంప‌తుల‌కు ధావ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఇటీవ‌లే శిఖర్ ధావ‌న్ కూడా పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. అత‌ను సోఫీ షైన్ అనే విదేశీ యువ‌తిని వివాహం చేసుకోగా ఆమెతోపాటు కుల్దీప్ యాద‌వ్ రిసెప్ష‌న్‌కు హాజ‌ర‌య్యాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పెట్టిన ఫొటోల‌కు ధావ‌న్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. కుల్దీప్ యాద‌వ్‌, వంశికాకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని, ఇద్ద‌రూ జీవితాంతం ప్రేమ‌గా, ఆనందంగా గ‌డ‌పాల‌ని కోరుకుంటున్నాన‌ని ధావ‌న్ తెలిపాడు.

పురాత‌న రోల్స్‌-రాయ్స్ కారులో వేదిక వ‌ద్ద‌కు..

కాగా కుల్దీప్ యాద‌వ్ భార‌త క్రికెట్ జ‌ట్టులో ప్ర‌స్తుతం కీల‌క ప్లేయ‌ర్‌గా ఉన్నాడు. అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 17 టెస్టులు, 120 వ‌న్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో జ‌ట్టులో స‌భ్యుడిగా కూడా ఉన్నాడు. కానీ అత‌ను మ్యాచ్‌లు ఆడ‌లేదు. ఇక రిసెప్ష‌న్ వేడుక‌కు అత‌ను క్లాసిక్ బ్లాక్ సూట్ ధ‌రించ‌గా, వంశికా క్రీమ్ రంగు చీర క‌ట్టుకుంది. ఈ ఇద్ద‌రూ పురాత‌న రోల్స్‌-రాయ్స్ కారులో వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ వేడుక‌కు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, రాష్ట్ర మంత్రి ఏ.కే. శర్మ కూడా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌లు సాంస్క‌తిక కార్య‌క్ర‌మాలను కూడా నిర్వ‌హించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM