రూ.2000 నోటుకు ఏమ‌వుతోంది ? ఆర్‌బీఐ ఏం చెబుతోంది ?

May 28, 2021 6:04 PM

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 2016 న‌వంబ‌ర్ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. త‌రువాత కొత్త రూ.500, రూ.2000 నోట్ల‌ను అందుబాటులోకి తెచ్చారు. న‌ల్ల ధ‌నాన్ని బ‌య‌ట‌కు తీసేందుకు, దొంగ నోట్ల‌ను అరిక‌ట్టేందుకు, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించేందుకు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు మోదీ ప్ర‌క‌టించారు. అయితే ఆ ల‌క్ష్యాలు నెర‌వేరాయో లేదో తెలియ‌దు కానీ రూ.2000 నోటు గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆర్‌బీఐ షాకింగ్ వార్త‌ల‌ను చెబుతూ వ‌స్తోంది.

what is happening to rs 2000 note what rbi says

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.2000 నోట్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని ఆర్‌బీఐ తాజాగా వెల్ల‌డించింది. 2019లోనే రూ.2000 నోట్ల ముద్ర‌ణ‌ను నిలిపివేశామ‌ని చెప్పిన ఆర్‌బీఐ ఇప్పుడు తాజాగా ఈ విష‌యం వెల్ల‌డించ‌డం షాక్‌కు గురి చేస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అత్య‌ధిక విలువ క‌లిగిన నోటు రూ.2000 నోటు కాగా ఈ నోట్లు ప్ర‌స్తుతం స‌ర‌ఫ‌రా కావ‌డం లేదు.

ఆర్‌బీఐ 2021 వార్షిక నివేదిక ప్ర‌కారం దేశంలో రూ.500, రూ.2000 నోట్ల శాతం 85.7 గా ఉంది. 2020 ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం 2018 మార్చి వ‌ర‌కు దేశంలో 33,632 ల‌క్ష‌ల రూ.2000 నోట్లు చెలామ‌ణీలో ఉండ‌గా మార్చి 2019 వ‌ర‌కు అది 32,910 ల‌క్ష‌ల‌కు త‌గ్గింది. 2020 చివ‌రి వ‌ర‌కు దేశంలో చెలామ‌ణీలో ఉన్న రూ.2000 నోట్ల సంక్య 27,398కు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే చెలామ‌ణీలో ఉన్న రూ.2000 నోట్ల సంఖ్య ఎప్ప‌టికప్పుడు త‌గ్గుతుండ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now