రూ.46 లక్షలు దోచుకున్నారు.. కానీ ప్రాణం దక్కలే?

May 28, 2021 8:36 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ కరోనా రక్కసి ఏకంగా కుటుంబాలపై పంజా విసిరి కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంటుంది. ఈ మహమ్మారి బారిన పడి ఓ వ్యక్తి ఏకంగా నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రాణాలు దక్కించుకో లేకపోయాడు.

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 16వ డివిజన్‌ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్‌బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకొని అక్కడ సిమెంట్, ఐరన్ వ్యాపారంతో పాటు జిమ్‌ సెంటర్‌ కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా రాజన్ బాబు తన భార్య ,ఇద్దరు పిల్లలు కరోనా భారినపడగా అందరూ
క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలోనే రాజన్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో అతనికి చికిత్స నిమిత్తం నగరంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.అన్ని ఆస్పత్రులలో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేశారు. రాజన్ బాబు చికిత్స కోసం ఫ్లాట్ ను కూడా అమ్మేసి చికిత్స అందించారు. సుమారు నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ అతని ప్రాణాలు కోల్పోయాడు. రాజన్ బాబు మాత్రమే కాకుండా తన తల్లి, సోదరి సైతం ప్రాణాలు కోల్పోగా భార్య పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. ఈ విధంగా కరోనా మహమ్మారికి కుటుంబం మొత్తం బలి కావడంతో రాజన్ భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now