సాధారణంగా మన ఇంట్లో ఫ్లోర్ ఒక రోజు శుభ్రం చేసుకుంటే మరుసటి రోజు మరి శుభ్రం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతి వస్తువును తరచూ శుభ్రం చేస్తుంటారు. ప్రతిరోజు ఈ విధంగా అన్ని వస్తువులను శుభ్రం చేయాలంటే ఎంతో సమస్యగా మారింది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ఐఐటీ హైదరాబాద్ ఆధునిక టెక్నాలజీతో కొవిడ్ రక్షణ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. ఒక్కసారి వీటితో ఫ్లోర్, కుర్చీ, సోఫా తదితర వస్తువులన్నింటికీ ఒకరోజు స్ప్రే చేస్తే దాదాపు 35 రోజులపాటు ఎంతో రక్షణగా ఉంటాయి.
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ స్టార్టప్ కంపెనీ కియా బయోటెక్ ‘డ్యూరోకియా’ పేరుతో వీటిని తయారుచేసింది. సాధారణంగా మార్కెట్లో లభించే శానిటైజర్ లు ఆల్కహాల్ తో తయారవుతాయి. దీనితో తరచూ చేతులు శుభ్రం చేయటం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ డ్యూరోకియా శానిటైజర్ లతో ఒక్కసారి శానిటైజ్ చేయడం ద్వారా 24 గంటల పాటు సురక్షితంగా ఉంచుతుంది. ప్రొఫెసర్ జ్యోతిష్ నందు గిరి బృందం దీనిని అభివృద్ధి చేసింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు అతి తక్కువ ధరలకే వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ‘డ్యూరోకియా’ఉత్పత్తులను శుక్రవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రారంభించనున్నారు. ఈ ఉత్పత్తులను నేటి నుంచి అమెజాన్ లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఉత్పత్తులను ఉపయోగించి మాస్కులను కూడా శానిటైజ్ చేసి తిరిగి వాడవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…
స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్‌పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…
దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…
దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ…
తిరుమల లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వపు జంగిల్ రాజ్ ను, అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేయడానికి సుప్రీంకోర్టు, జాతీయ మానవ…
లా గ్రాడ్యుయేట్లకు భారత సైన్యంలో అధికారిగా సేవలందించే అరుదైన అవకాశం లభించింది. Indian Army జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG)…