ఐపీఎల్

ఐపీఎల్ 2021: పంజాబ్‌పై సునాయాసంగా నెగ్గిన చెన్నై..!

ముంబైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 8వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఉంచిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చెన్నై అల‌వోక‌గా ఛేదించింది. వికెట్లను కోల్పోయిన‌ప్ప‌టికీ త‌క్కువ ఓవ‌ర్ల‌లోనే చెన్నై ల‌క్ష్యాన్ని అందుకుంది. ఈ క్ర‌మ‌లో పంజాబ్‌పై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ల‌లో షారూఖ్ ఖాన్ మాత్ర‌మే ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన ఎవ‌రూ రాణించ‌లేదు. 36 బంతులు ఆడిన షారూఖ్ 4 ఫోర్లు, 2 సిక్సర్ల‌తో 47 ప‌రుగులు చేశాడు. చెన్నై బౌల‌ర్ల‌లో దీప‌క్ చాహ‌ర్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. శామ్ కుర్రాన్‌, మొయిన్ అలీ, డ్వానె బ్రేవోల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన చెన్నై 15.4 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. 107 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్ల‌లో మొయిన్ అలీ, డుప్లెసిస్‌లు రాణించారు. 31 బంతులు ఆడిన అలీ 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 46 ప‌రుగులు చేయ‌గా, 33 బంతులు ఆడిన డుప్లెసిస్ 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 36 ప‌రుగులు చేశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ 2 వికెట్లు తీయ‌గా, అర్ష‌దీప్ సింగ్‌, మురుగ‌న్ అశ్విన్‌లు చెరొక వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM