Gadwal : సాధారణంగా ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే ఎంతో మంది ఆడ పిల్లల పట్ల వివక్షత చూపిస్తూ వారిని కడుపులోనే కడ తేర్చడం లేదా పుట్టిన తర్వాత చెత్త కుప్పలు, మురికి కాలువల పాలు చేయడం మనం చూస్తుంటాము. అయితే గద్వాల్ జిల్లాలో వింత ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు వరుసగా కూతుర్లు పుడుతున్నారన్న నెపంతో ఆ భర్త ఏకంగా భార్యను కడతేర్చిన ఘటన గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన పల్లవి అనే యువతికి, గద్వాలకు చెందిన వెంకటేశ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గత ఏడాది ఒక పాప జన్మించింది. ఈ క్రమంలోనే పల్లవి మరోసారి గర్భం దాల్చడంతో ఈసారి ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విధంగా వరుసగా ముగ్గురు కూతుర్లు పుట్టినప్పటికీ జీర్ణించుకోలేని వెంకటేష్ పల్లవి నిద్రిస్తుండగా ఆమెపై కోపంతో గొంతు నులిమి చంపాలని ప్రయత్నించాడు.
అయితే పల్లవి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఏమైందని ప్రశ్నించగా ఆమెకు ఫిట్స్ వచ్చాయని ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే పల్లవి మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో బంధువులకు అతని మాటలపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నిర్వహించడంతో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారమే పల్లవిని హత్య చేశాడని తెలియడంతో వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం కూతుళ్లకు జన్మనిచ్చిందన్న కారణంగా భార్యను కడతేర్చాడని తెలియడంతో స్థానికులు వెంకటేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…