తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలకు ప్రజలు వేసే ఓట్లు వృథా అవుతాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీకి ఓటు వేస్తే ప్రధాని మోదీ రారని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రారని, కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమిస్తారని, కనుక కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీతోపాటు బీఆర్ఎస్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది నాగుపాముల్లా పెనవేసుకున్న బంధం అని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎలాంటి ప్రత్యేక ప్రాజెక్టులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే, తిరిగి కేవలం 42 పైసల విలువైన ప్రాజెక్టులే వస్తున్నాయని అధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు కోట్ల రూపాయలు ఇస్తున్నామంటూ ప్రచారం చేస్తుందని, కానీ ఎక్కువ భాగం ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్తోందని విమర్శించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. బీజేపీ నేతలు తమ దేవుడు రాముడని చెబుతారు. కానీ ప్రతి ఉదయం ఓవైసీకి నమస్కరిస్తారు. రోజంతా రాముడి పేరు కంటే అసదుద్దీన్ ఓవైసీ పేరును ఎక్కువగా స్మరిస్తారని అన్నారు. ఓవైసీనే బీజేపీకి జీవనాడిగా మారారని, ఎంఐఎం పేరుతోనే ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం ఒక రాజకీయ పార్టీగానే ఉందని, మతాన్ని రాజకీయం కోసం వాడుకోవడం బీజేపీ తత్వాన్ని చూపిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాషాయ పార్టీకి ఓటేయాలా వద్దా అన్నది తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్‌పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…