అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్ నటి రాధిక అన్నారు. తాజాగా ఆట డ్యాన్స్ షోలో ఆమె జడ్జిగా పాల్గొని ఆ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె అల్లు అర్జున్‌కు ఎప్పుడు, ఎక్కడ, ఎలా డ్యాన్స్ నేర్పించారు.. అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యంలో ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఆమె కామెంట్లను ఫన్నీగా కొట్టి పారేయగా, మరికొందరు మాత్రం సీరియస్‌గా తీసుకుని కామెంట్లు చేశారు. ఎప్పుడైనా ఆయన చిన్నతనంలో ఆమె ఏదైనా సందర్భంలో ఒకటి రెండు డ్యాన్స్ స్టెప్స్‌ను నేర్పించి ఉండవచ్చు, అందుకనే ఆమె అలా కామెంట్ చేసిందని పలువురు నెటిజన్లు అంటున్నారు. అయితే ఆ సందర్భాన్ని కూడా రాధిక వివరించారు.
నటి రాధిక హీరోయిన్‌గా అప్పట్లో పలు భాషలకు చెందిన చిత్రాల్లో ఎక్కువగా నటించారు. తెలుగు, తమిళ సినిమాల్లో ఆమె ఎక్కువగా యాక్ట్ చేశారు. ప్రస్తుతం టీవీ షోలు, సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లోనూ తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ఆట డ్యాన్స్ షోలో జడ్జిగా పాల్గొన్న ఆమె ప్రీతి అనే కంటెస్టెంట్ వేసిన పుష్ప 2లోని జాతర స్టెప్పులకు ఫిదా అయి ప్రీతిని అభినందించారు. అదే సందర్భంలో ఆమె అల్లు అర్జున్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బన్నీకి డ్యాన్స్ నేర్పించింది తానే అని తెలిపారు. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులే కాకుండా బన్నీ ఫ్యాన్స్, సినిమా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రీతిని పొగిడిన అనంతరం రాధిక మాట్లాడుతూ అల్లు అర్జున్ అంత గొప్ప డ్యాన్సర్ అవడానికి తానే కారణమని చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అప్పట్లో తాను ఓ సినిమా చేశానని, అప్పుడు షూటింగ్ సందర్భంగా బన్నీకి డ్యాన్స్ నేర్పించానని గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సీన్‌లో యాక్ట్ చేసేందుకు చిన్న పిల్లాడు అవసరం అయ్యాడని, అయితే బన్నీ అందుబాటులో ఉండడంతో అతనితో ఓ సీన్‌లో యాక్ట్ చేశానని రాధిక చెప్పారు. ఆ సీన్‌లో అల్లు అర్జున్‌ను ఎత్తుకుని రైల్వే ట్రాక్‌పై పరుగెత్తానని తెలిపారు. కాగా ఆ డ్యాన్స్ షోకు చెందిన ప్రోమోలో రాధిక చేసిన కామెంట్లను పెట్టారు. దీంతో ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రాధిక ఈ కామెంట్లను ఫన్నీగానే చేసినట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై సరదాగానే రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా.. అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఆయన టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి వసూళ్లలో రికార్డులను సృష్టించాయి. ఇక ప్రస్తుతం బన్నీ అట్లీతో కలిసి ఓ మూవీ చేస్తుండగా, అది పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…