వినోదం

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేసిన నటి సాయి పల్లవి. Photo Credit: Sai Pallavi/Instagram.

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌లి కాలంలో ఆమె పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో, సినీ వ‌ర్గాల్లో విప‌రీతంగా ప్ర‌చారం అవుతున్నాయి. ఆమె త్వ‌ర‌లోనే ఓ బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకోనుంద‌ని ప్ర‌చారం ఎక్కువైంది. ఆమె సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటికి సాయిప‌ల్ల‌వి ఫుల్‌స్టాప్ పెట్టింది. ప్ర‌స్తుతం తాను సినిమాల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో ఆమె వివాహం ప‌ట్ల వ‌స్తున్న వార్త‌లు వ‌దంతులే అని తేలింది. సోష‌ల్ మీడియాలో లేదా, సినిమా వ‌ర్గాల్లో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, అవ‌న్నీ పుకార్లేన‌ని తేల్చి చెప్పింది. కాగా సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

ఏదైనా ఉంటే నేనే చెబుతా: సాయి ప‌ల్ల‌వి

వెండితెర‌పై మేక‌ప్ లేకుండా మెరిసిపోయే న‌టి ఎవ‌రు.. అని అడిగితే చాలా మందికి సాయిప‌ల్ల‌వి పేరు ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. ఆమె ప్రేమ‌మ్ సినిమాలో మ‌ల‌ర్ టీచ‌ర్‌గా అబ్బాయిల గుండెల్లో అల‌జడి సృష్టించింది. త‌క్కువ కాలంలోనే సౌతిండియాపై త‌నదైన ముద్ర వేసింది. కేవ‌లం న‌ట‌న‌తోనే కాకుండా త‌న డ్యాన్స్‌తోనూ ఎంతో మంది అభిమానుల‌ను ఆమె సంపాదించుకుంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె వివాహం చేసుకోబోతుంద‌నే వార్త‌లు ఎక్కువ‌గా ప్ర‌చారం అవుతున్నాయి. ఆమె ఎల్ల‌ప్పుడూ ఆ వార్త‌ల‌కు స్పందిస్తూ అవ‌న్నీ పుకార్లేన‌ని కొట్టి పారేస్తోంది కూడా. అందులో భాగంగానే తాజాగా మ‌రోమారు వ‌చ్చిన వార్త‌ల‌ను కూడా ఆమె ఖండించింది. ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఏదైనా ఉంటే తానే చెబుతాన‌ని ఆమె స్ప‌ష్టం చేసింది.

సినిమాల్లో బిజీ బిజీగా..

ఇక సాయిప‌ల్ల‌వి సినిమాల విష‌యానికి వ‌స్తే ఆమె గ‌తంలో ఎన్న‌డూ లేనంత బిజీగా ప్ర‌స్తుతం ఉంది. గ‌తేడాది నాగ‌చైత‌న్యతో క‌లిసి ఆమె న‌టించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ టాక్‌ను సాధించింది. అయిన‌ప్ప‌టికీ అందులో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక బాలీవుడ్‌లోనూ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అమీర్‌ఖాన్ త‌న‌యుడు జునైద్ ఖాన్ న‌టిస్తున్న చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తోంది. ఈ మూవీకి ఏక్ దిన్ అనే పేరును ఖ‌రారు చేశారు. తెలుగులో ఒక రోజు టైటిల్‌తో ఈ మూవీ విడుద‌ల కానుంది. మే1, 2026న ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో నార్త్ ప్రేక్ష‌కుల‌ను కూడా సాయిప‌ల్ల‌వి త‌న మ్యాజిక్‌తో ఆక‌ట్టుకుంటుంద‌ని సినీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఆమె న‌టిస్తున్న మ‌రో భారీ ప్రాజెక్టు రామాయ‌ణ్‌. ఇందులో ఆమె సీత పాత్ర‌లో యాక్ట్ చేస్తోంది. రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ క‌నిపించ‌నున్నాడు. అనేక భార‌తీయ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి చెందిన మొద‌టి పార్ట్‌ను ఈ ఏడాది దీపావళి కానుక‌గా న‌వంబ‌ర్ 8, 2026న రిలీజ్ చేయ‌నున్నారు. అయితే గ్లామ‌ర్‌కు దూరంగా ఉండే సాయిప‌ల్ల‌వి.. గ్లామ‌రే ప్ర‌ధానంగా ఉండే బాలీవుడ్‌లో ఎలా నెట్టుకు వ‌స్తుందో చూడాల‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM

హీరోయిన్లతో ఏజ్ గ్యాప్‌పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్‌లో లేనిది ఇక్కడేంటి?’

సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ హీరోయిన్లు న‌టించ‌డం స‌హ‌జ‌మే. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని భాష‌ల్లోనూ ఎప్ప‌టి నుంచో…

Wednesday, 25 March 2026, 7:17 PM

‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేస్తూ ఘ‌న విజ‌యం సాధించి ముందుకు సాగుతున్న…

Wednesday, 25 March 2026, 12:27 PM