ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో కనిపిస్తారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె చిరంజీవి, నాగబాబులతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆ పోస్టులో వివరించారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఆమె అందులో పోస్టు పెట్టారు. దాంట్లో మెగా ఫ్యామిలీ గురించి పలు విషయాలను ఆమె వెల్లడించారు. చిరంజీవి, నాగబాబు వరుసకు బావలే అయినా ఆమె సోదరులతో సమానంగా భావిస్తానని చెప్పారు.
అన్నా లెజినోవా తన పోస్టులో అన్నయ్యనా.. బావగారా..? అని రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో ఒక దాంట్లో ఆమె పవన్, చిరంజీవితో కలసి ఉండగా, చిరు ఆమెను గారాబం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మరో ఫొటోలో ఆమె నాగబాబుతో ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో తాను గత 15 ఏళ్ల కిందట అడుగు పెట్టానని, ఈ కుటుంబంలో ఎప్పుడూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు చూపిస్తారని ఆమె తెలిపారు. తాను ఈ ఫ్యామిలీలోకి వచ్చిన కొత్తల్లో ఇక్కడ ఎలా ఉండాలో, ఎవరిని ఎలా పిలవాలో అర్థం కాలేదని, దీంతో తన భర్త పవన్ వారిని ఎలా పిలుస్తున్నారో గమనించి తాను కూడా అలాగే పిలిచేదాన్నని చెప్పుకొచ్చారు.
చిరంజీవిని అన్నయ్య అని, నాగబాబును చిన్నన్నయ్య అని పిలిచేదాన్నని అన్నా లెజినోవా వివరించారు. మొదట మామూలుగా అన్నయ్య అని పిలిచానని, కానీ ఆ తరువాతే ఆ బంధం గొప్పతనం అర్థమైందని అన్నారు. తరువాత తాను బావగారు అని పిలవడం నేర్చుకున్నానని, తనకు సోదరులు లేరని, కానీ ఈ బంధం తనకు చిరంజీవి, నాగబాబుల రూపంలో ఇద్దరు సోదరులను ఇచ్చిందని ఆమె తెలిపారు. కాగా అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయగా 24 గంటల్లోనే 2.40 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ఎంతో కాలంగా ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేయాలని అనుకుంటున్నానని, ఇప్పుడు సరైన సమయం వచ్చిందని, అందుకనే అకౌంట్ ఓపెన్ చేశానని ఆమె తెలిపారు.
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…