ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసల్లో ముంచెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ మూవీ గురించి తరచూ తన సోషల్ ఖాతాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఈ మూవీ గురించి పెట్టిన ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ధురంధర్ 2 సినిమా అనేక రికార్డులను బ్రేక్ చేయడంతో ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన వారు తమ చిత్రాల రికార్డులు ఇక ధురంధర్ 2ను అధిగమించాలని కోరుకుంటారని, అందుకు అవసరం అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిని, వైష్ణోదేవిని దర్శించుకుని పూజలు చేస్తారని అన్నారు. ధురంధర్ 2 సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌పై కూడా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు స్పష్టమైన అభిప్రాయాలను చెబుతూ సినిమా ప్రపంచంలో ఆసక్తికర చర్చలకు తెర తీస్తుంటారు. ధురంధర్ 2 సినిమా ఘన విజయం సాధించిన అనంతం ఆయన తన సోషల్ ఖాతాల్లో వరుస పోస్టులు పెడుతూ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు ధురంధర్ 2 సక్సెస్‌ను సవాల్‌గా తీసుకుంటారని అంచనా వేశారు. బయటకు ఎవరూ అసహనం వ్యక్తం చేయకపోయినా లోలోపల అది ఉంటుందని అన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ వారు తమ టాక్సిక్ సినిమా ధురంధర్ 2 రికార్డులను బద్దలు కొట్టాలని దేవుళ్లను ప్రార్థిస్తారని అన్నారు.
ఇక దర్శకుడు ఆదిత్య ధర్‌ను సైతం ఆర్‌జీవీ మెచ్చుకున్నారు. కొందరు దీన్ని ప్రాపగాండా మూవీగా అభివర్ణిస్తున్నారని, కానీ ప్రతి ఒక్కరికి ఒక అంశంపై భిన్న రకాల అభిప్రాయాలు ఉంటాయని, అలాగే దర్శకుడు ఆదిత్య ధర్‌కు కూడా అభిప్రాయాలు ఉంటాయని, దాని ప్రకారమే ఆ సినిమా తీశారని అన్నారు. ఏ ఇద్దరూ ఒక అంశంపై ఏకీభవించాలనే నియమం లేదని స్పష్టం చేశారు. ఒక అంశాన్ని ఒక దర్శకుడు ఒక విధంగా సినిమాగా తీస్తే, ఇంకో దర్శకుడు మరో విధంగా తీస్తాడని, ఆదిత్య ధర్ తన విశ్వాసాలపై భరోసా ఉంచి సినిమా తీశారని, ఆయనకు తన పరిశోధన ఉందని, తన వనరులు తనకు ఉన్నాయని, వాటిని బట్టే సినిమా తీశారని, అవి ఒక వ్యక్తికి, మరొక వ్యక్తికి మారుతాయని ఆర్‌జీవీ పేర్కొన్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ సామర్థ్యం కలిగిన వ్యక్తి అని, ఒక దర్శకుడికి సామర్థ్యం ఉంటే ప్రేక్షకులకు తాను నమ్మింది చూపిస్తాడని వర్మ కితాబిచ్చారు. ఎవరికైనా ఈ సినిమా తప్పు అనిపిస్తే వారికి సినిమా తీసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని సెటైర్ వేశారు. ఇక ధురంధర్ 2 కథ విషయానికి వస్తే ఇందులో రణవీర్ సింగ్ హమ్‌జా అలీ మజారి అనే పాత్రలో యాక్ట్ చేయగా, ఆ పాత్ర ఎదుగుదలను ఇందులో చూపించారు. అతను షేర్-ఎ-బలోచ్‌గా, లియారీ ప్రాంతంలో అపరాజిత నాయకుడిగా ఎలా ఎదిగాడో ఇందులో చూపించారు. జస్కిరత్ సింగ్ రంగీగా మొదలైన అతని ప్రయాణం, దేశంలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌లోకి గూఢచారిగా ప్రవేశించే వరకు సాగుతుంది. స్పై-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో రణవీర్ సింగ్‌తోపాటు అర్జున్ రామ్‌పాల్, ఆర్.మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, డానిష్ పండోర్, సారా అర్జున్‌లు కీలకపాత్రల్లో నటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…