రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది. గత చిత్రాల రికార్డులను కూడా ఈ మూవీ బ్రేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. అయితే ఈ మూవీ తాజాగా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. వసూళ్ల విషయంలో ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో శోభు యార్లగడ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. తాను ఇటీవలే ధురంధర్ 2 సినిమాను వీక్షించానని, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని కితాబిచ్చారు.
ధురంధర్ 2 చిత్రం కేవలం భారత్ లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన హవా ప్రదర్శిస్తోంది. ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా 9 ఏళ్లుగా ఉన్న బాహుబలి 2 రికార్డును ధురంధర్ 2 అధిగమించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయంపై శోభు యార్లగడ్డ స్పందించారు. ఆయన ఇంకా చెబుతూ ధురంధర్ 2 చిత్రాన్ని తాను పూర్తిగా ఆస్వాదించానని అన్నారు. ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని, కొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుందని, బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టడం అభినందనీయమని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
కాగా బాహుబలి 2 చిత్రం 2017 ఏప్రిల్‌లో రిలీజ్ అయింది. అప్పట్లో నార్త్ అమెరికాలో ఈ మూవీ 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. విడుదలైన 10 రోజుల్లోనే ధురంధర్ 2 ఈ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ.1226 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు వివరాలను వెల్లడించాయి. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ మూవీని ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు ప్రశంసల్లో ముంచెత్తారు.
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…