క్రికెట్

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ ప్రదర్శనపై పెదవి విరిచిన ఇర్ఫాన్ పఠాన్. Photo Credit: Jio Hotstar.

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓట‌మి పాలైంద‌ని భారత మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ అన్నారు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట‌ర్ జియో హాట్ స్టార్‌తో ప‌ఠాన్ మాట్లాడుతూ స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ప్రారంభంలోనే వికెట్ల‌ను కోల్పోవ‌డం మైన‌స్ అయింద‌ని, ప‌వ‌ర్ ప్లేను స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయార‌ని అన్నారు. దీని వ‌ల్ల భారీ స్కోరు చేసే అవ‌కాశాన్ని స‌న్ రైజ‌ర్స్ కోల్పోయింద‌ని, ఇది మ్యాచ్‌పై ప్ర‌భావం చూపించింద‌ని అన్నారు. మ్యాచ్ ప్రారంభంలో త‌మ మెథ‌డ్స్‌ను పునఃప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ ఇషాన్ కిష‌న్ అన‌డం గ‌మ‌నించాన‌ని, అయితే వ‌రుస‌గా వికెట్లు కోల్పోతే కాస్త బాధ్య‌త‌గా ఆడాల‌ని, కానీ ఆ మ్యాచ్‌లో అలా జ‌ర‌గలేద‌ని అన్నారు.

అన్ని విభాగాల్లోనూ రాణించాల్సిందే: ఇర్ఫాన్ ప‌ఠాన్‌

ప‌వ‌ర్‌ప్లేలోనే 3 వికెట్ల‌ను కోల్పోవ‌డంతో స‌న్ రైజ‌ర్స్ ప్రారంభంలోనే ఒత్తిడిలో ప‌డింద‌ని, దీంతో మిడిలార్డ‌ర్ వేగాన్ని పెంచ‌డం కంటే ఇన్నింగ్స్‌ను నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయాల్సి వ‌చ్చింద‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్ పేర్కొన్నారు. చివ‌ర‌కు 200 ప‌రుగుల మార్క్‌ను చేరుకున్న‌ప్ప‌టికీ పిచ్ స్వ‌భావాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ స్కోరు స‌రిపోద‌ని అన్నారు. బౌలింగ్ విభాగంలో స‌న్ రైజ‌ర్స్ కు స‌రైన వ‌న‌రులు లేవ‌ని, ఈ కొర‌త కూడా వారికి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింద‌ని ప‌ఠాన్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా మ్యాచ్‌లో కీల‌క ద‌శ‌ల్లో బౌలింగ్ పై నియంత్ర‌ణ కొర‌వ‌డింద‌ని, అది జ‌ట్టుకు న‌ష్టం క‌లిగించింద‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో టోర్న‌మెంట్‌లో ముందుకు సాగాలంటే బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ప‌వ‌ర్ ప్లేలోనూ బాధ్య‌త‌గా ఆడాల్సి ఉంటుంద‌ని ప‌ఠాన్ స్ప‌ష్టం చేశారు.

బ‌ల‌హీనంగా స‌న్ రైజ‌ర్స్ బౌలింగ్‌..

కాగా ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ బెంగ‌ళూరు ఎం.చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు గ‌తేడాది తొక్కిస‌లాట మృతులకు ప్లేయ‌ర్లు, ప్రేక్ష‌కులు నివాళులు అర్పించారు. మ్యాచ్‌లోనూ ఇరు జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్లు న‌లుపు రంగు బ్యాండ్ల‌ను ధ‌రించి ఆడారు. టాస్ గెలిచిన బెంగ‌ళూరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్ చేసి 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 201 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిష‌న్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 80 ప‌రుగులు చేశాడు. త‌రువాత లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చిన అనికేత్ వ‌ర్మ 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 43 ప‌రుగులు చేశాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జ‌ట్టు 15.4 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్ల‌ను కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 69 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 61 ప‌రుగులు చేశాడు. కోహ్లి, ప‌డిక్క‌ల్‌ల విజృంభ‌ణ‌తో ఇంకా 26 బంతులు మిగిలి ఉండ‌గానే ఆర్‌సీబీ విజ‌యం సాధించింది. అయితే స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు బ్యాటింగ్ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ బౌలింగ్ విభాగంలో మాత్రం చాలా బ‌ల‌హీనంగా ఉంది. చెప్పుకోద‌గిన బౌల‌ర్లు ఎవ‌రూ లేరు. దీంతో ముందు ముందు టోర్నీలో స‌న్ రైజ‌ర్స్ కు ఆ విభాగంలో క‌ష్టాలు ఎదురుకాక త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు త‌మ త‌రువాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 5, 2026న సొంత మైదానంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ఆడ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM