ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంఎస్‌ఎంఈ (MSME) విభాగంలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 6, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (bankofbaroda.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని ఫిబ్రవరి 26, 2026 గా నిర్ణయించారు.
MSME రిలేషన్‌షిప్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులు 14 ఖాళీగా ఉండగా, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 62, సీనియర్ మేనేజర్ పోస్టులు 113 ఖాళీగా ఉన్నాయి. MSME సేల్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 177 ఖాళీగా ఉండగా, క్రెడిట్ అనలిస్ట్ విభాగంలో సీనియర్ మేనేజర్ పోస్టులు 19, మేనేజర్ పోస్టులు 34 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 419 పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్‌ను చేపట్టనున్నారు.
MSME విభాగంలో బ్యాంకింగ్ కెరీర్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులకు ఈ రిక్రూట్‌మెంట్ ను మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను లేదా నోటిఫికేషన్‌ను సందర్శించి వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…
థియేటర్లలో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అలవాటు పడ్డారు.…
తనను విమర్శించే వారిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని నటి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. తన సొంత బ్యానర్‌పై తెరకెక్కుతున్న…
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…