బ్యాంక్ ఆఫ్ బరోడాలో 419 ఆఫీసర్ కొలువులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంఎస్‌ఎంఈ (MSME) విభాగంలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

February 10, 2026 9:29 AM
Bank of Baroda 419 officer posts recruitment 2026 notification.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. Photo Credit: Business Standard.

ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంఎస్‌ఎంఈ (MSME) విభాగంలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 6, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (bankofbaroda.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని ఫిబ్రవరి 26, 2026 గా నిర్ణ‌యించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీల వివరాలు..

MSME రిలేష‌న్‌షిప్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులు 14 ఖాళీగా ఉండ‌గా, డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు 62, సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టులు 113 ఖాళీగా ఉన్నాయి. MSME సేల్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు 177 ఖాళీగా ఉండ‌గా, క్రెడిట్ అన‌లిస్ట్ విభాగంలో సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టులు 19, మేనేజ‌ర్ పోస్టులు 34 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 419 పోస్టుల‌కు ఈ రిక్రూట్‌మెంట్‌ను చేప‌ట్ట‌నున్నారు.

అర్హత ప్రమాణాలు

  • అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫుల్‌టైమ్ MBA / PGDM (మార్కెటింగ్, ఫైనాన్స్) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. పోస్టును బట్టి 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం అవసరం ఉంటుంది.
  • సీనియర్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్, MSME రిలేషన్‌షిప్), మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు కూడా గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. MBA / PGDM / CA / CFA / CMA అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ పోస్టులకు 2 నుంచి 8 సంవత్సరాల అనుభవం అవసరం ఉంటుంది.
  • వివరమైన అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని బ్యాంక్ సూచించింది.

రిక్రూట్‌మెంట్ ముఖ్య వివరాలు

  • బ్యాంక్ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా
  • విభాగం: MSME బ్యాంకింగ్
  • మొత్తం ఖాళీలు: 419
  • దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 6, 2026
  • చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2026
  • వయస్సు పరిమితి: 22-40 సంవత్సరాలు (పోస్టును బట్టి మారుతుంది)
  • రిజర్వ్డ్ కేటగిరీలకు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు
  • జీతం: స్కేలు ప్రకారం (రెగ్యులర్ / కాంట్రాక్ట్ ఆధారంగా)

ద‌రఖాస్తు ఫీజు

  • జనరల్ / EWS / OBC: రూ.850
  • SC / ST / PwBD / మహిళలు / మాజీ సైనికులు: రూ.175

దరఖాస్తు విధానం

  • బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌(bankofbaroda.in)ను సందర్శించాలి
  • కొత్త అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి
  • వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అనుభవ వివరాలు నమోదు చేయాలి
  • ఫోటో, సంతకం, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి
  • వర్తించే ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి
  • దరఖాస్తు ఫామ్‌ను సబ్‌మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి

MSME విభాగంలో బ్యాంకింగ్ కెరీర్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్న‌ అభ్యర్థులకు ఈ రిక్రూట్‌మెంట్ ను మంచి అవకాశంగా చెప్ప‌వ‌చ్చు. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

గ‌మనిక‌: అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను లేదా నోటిఫికేష‌న్‌ను సంద‌ర్శించి వివ‌రాల‌ను ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment