తెలంగాణ

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. Photo Credit: Bandi Sanjay/X.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే ఆ 6 గ్యారంటీల‌ను అమ‌లు చేసిన‌ట్లు వారు నిరూపిస్తే తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు. 6 గ్యారంటీలు అమ‌లు కాలేద‌ని తాను నిరూపిస్తే రేవంత్ రెడ్డి త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోతారా..? అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్‌ యార్డు స్థలాన్ని ఆయన స్థానిక బీజేపీ నాయకులు, గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

డ‌బ్బు మూట‌లు పంచేందుకే రేవంత్ కేర‌ళ‌కు..

సీఎం రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే త‌న స‌వాల్‌ను స్వీక‌రించాల‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు. గ‌తంలో బీహార్‌, ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా ఎన్నిక‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వెళ్లార‌ని, తెలంగాణ‌లో 6 గ్యారంటీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్ప‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు వాస్త‌వాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి క‌ర్రు కాల్చి వాత పెట్టార‌న్నారు. ఇప్పుడు కేర‌ళ‌లోనూ అలాగే ప్ర‌చారం చేస్తున్నార‌ని, డ‌బ్బు మూట‌లు పంచ‌డానికే సీఎం రేవంత్ రెడ్డి కేర‌ళ వెళ్లార‌ని ఆరోపించారు.

కేర‌ళ ప్ర‌జ‌లు, మీడియా తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తే 6 గ్యారంటీల అమ‌లుపై వాస్త‌వాలు తెలుస్తాయ‌న్నారు. అబ‌ద్ధాలు ఆడ‌డంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఇవ్వాల‌ని విమ‌ర్శించారు. డంపింగ్ యార్డు ఏర్పాటును అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించ‌గా ప్ర‌స్తుత కాంగ్రెస్ స‌ర్కారు అమ‌లు చేస్తుంద‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM

‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా…

Friday, 3 April 2026, 6:02 PM

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి…

Thursday, 2 April 2026, 3:04 PM

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అద్భుతం.. హనుమాన్ విగ్రహంపై సూర్య కిరణాలు!

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా త‌మ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్ర‌హంపై సూర్య కిర‌ణాలు ప‌డ‌డం త‌న…

Thursday, 2 April 2026, 11:37 AM