సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి చేసిందని అభిషేక్ కోచ్, మాజీ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అన్నారు. స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా జట్టుతో ఉండడమే కాకుండా జట్టు కోసం మ్యాచ్ లలో కఠినంగా శ్రమిస్తున్న అభిషేక్‌ను కాదని, కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ అప్పగించడం సరికాదని అన్నారు. ఇషాన్ కిషన్ గొప్ప ప్లేయర్ అని, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తమ జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి తొలి టైటిల్‌ను అందించాడని, అయితే జట్టులో ఎంతో కాలంగా ఉన్న ప్లేయర్లకు చాన్స్ ఇస్తే బాగుంటుందని అన్నారు. అభిషేక్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడని, అందువల్ల కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించే సత్తా అతనికి ఉందని యువరాజ్ అన్నారు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్, ఆసీస్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక కెప్టెన్‌గా కిషన్‌ను నియమించారు. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ కొనసాగుతున్నాడు. అయితే అభిషేక్‌తోపాటు జట్టులో ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారని, కనీసం వారికైనా కెప్టెన్సీ ఇచ్చి ఉండాల్సిందని యువరాజ్ అభిప్రాయపడ్డారు.
టీ20 ప్రపంచకప్ 2026లో ఆద్యంతం ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కీలక మ్యాచ్‌లలో రాణించి జట్టు ట్రోఫీని లిఫ్ట్ చేయడంలో ఇషాన్ కిషన్ పాత్ర ఎంతో ఉంది. అయితే టోర్నీలో చివరి వరకు ఫామ్‌లో లేని అభిషేక్ శర్మ ఫైనల్‌లో మాత్రం తనదైన బ్యాటింగ్ శైలితో చెలరేగాడు. దీంతో తొలి వికెట్‌కు టీమిండియా అద్భుతమైన భాగస్వామ్యం సాధించింది. ఇది భారీ స్కోరు చేసేందుకు ఉపయోగపడింది. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కిషన్ 20 ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రాణించడంతోనే అతనికి ప్రస్తుతం సన్ రైజర్స్ యాజమాన్యం చాన్స్ ఇచ్చిందని స్పష్టమవుతోంది. కానీ యువరాజ్ మాత్రం సీనియారిటీకి పెద్ద పీట వేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్లు ఉండగా కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గత 8 ఏళ్లుగా జట్టుతో ఉన్న అభిషేక్ శర్మకు కాకుండా కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం సరికాదని భావిస్తున్నానని తెలిపారు.
అభిషేక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోవడం తనను నిరాశకు గురి చేసిందని యువరాజ్ అన్నారు. ఇషాన్ కిషన్ అంటే తనకు కూడా ఇష్టమేనని, అతను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, కానీ అభిషేక్ శర్మ గత 8 ఏళ్లుగా ఎస్ఆర్‌హెచ్ జట్టుతో ఉన్నాడని, ప్రతి సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని అన్నారు. ఎస్ఆర్‌హెచ్ కోసం అభిషేక్ తన సర్వస్వాన్ని ధారపోస్తున్నాడని, అతను దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. అటువంటి వ్యక్తికి కెప్టెన్సీ ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమని, గతంలో తనకు కూడా ఇలాగే జరిగిందని తెలిపారు. 2007లో తాను వైస్ కెప్టెన్‌గా ఉన్నానని, సెహ్వాగ్, భజ్జీ వంటి సీనియర్లు ఉన్నారని, కానీ ఎక్కడి నుంచో వచ్చిన ధోనీ కెప్టెన్ అయ్యాడని, అప్పట్లో అది తనకు ఎలా అనిపించిందో, ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడని అన్నారు. అయితే ధోనీ మాత్రం భారత జట్టుకు కెప్టెన్‌గా అద్భుతమైన విజయాలను అందించాడని అంగీకరించారు.
అయితే ధోనీ సాధించిన విజయాలను చూశాక అతను కెప్టెన్సీకి అర్హుడని అనిపించిందని యువరాజ్ తెలిపారు. దీన్ని తాను కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెబుతున్నానని, ధోనీ లేదా ఇతర ప్లేయర్లు ఎవరన్నా తనకు కోపం లేదని యువీ స్పష్టం చేశారు. అయితే ఒక ప్లేయర్ కొన్నేళ్ల పాటు జట్టుకు సేవలు అందించినప్పుడు అతన్ని కెప్టెన్‌గా చేయకపోతే కొంత నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. కాగా యువరాజ్ సింగ్ శిక్షణలోనే అభిషేక్ శర్మ రాటుదేలాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభిషేక్ చాలా సందర్భాల్లో తాను ఇలా మారడానికి యువీ పాజీ కారణమని చెప్పాడు. అయితే వారి మధ్య ఉన్న అన్యోన్య బంధం కారణంగానే యువీ ఆ వ్యాఖ్యలు చేశాడని స్పష్టమవుతోంది.
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…