మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఆమె తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తుందా, లేదా అన్నది తెలియదు కానీ, ప్రస్తుతం పలు ఇతర భాషలకు చెందిన చిత్రాలతో ఆమె బిజీగా ఉంది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా రూపొందిస్తున్న మూడో చిత్రం పాకెట్ నవెల్ లో విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, కిశోర్, రాజు బి.శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే మార్చి నెల ముగిసిన నేపథ్యంలో ఆ నెలలో తన అనుభవాలను మాళవిక మోహనన్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి నెల తనకు మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని తెలియజేసింది. అయితే షూటింగ్ కోసం ఇంటికి దూరంగా ఉండడం మాత్రం తనను కుంగదీసిందని తెలియజేసింది.
మార్చి నెల తనకు మిక్స్‌డ్ బ్యాగ్ గా అనిపించిందని ఆమె పేర్కొంది. అయితే దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజాతో కలిసి పాకెట్ నవెల్ చిత్రంలో పని చేయడం తనకు ఆ నెలలో అత్యంత ముఖ్యమైన అనుభవమని తెలిపింది. మన తరం అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన ఆయనతో పని చేయడం, ఆయన పని విధానాన్ని దగ్గరగా గమనించడం, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన క్రియేటివ్ అనుభవాల్లో ఒకటని మాళవిక పేర్కొంది. ఆరణ్య కాండం, సూపర్ డీలక్స్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ దర్శకుడితో తన అనుభవాలను త్వరలో మరింత వివరంగా పంచుకుంటానని కూడా చెప్పింది.
అయితే ఈ చిత్ర షూటింగ్ కారణంగా తాను ఎక్కువకాలం చెన్నైలో ఉండాల్సి రావడంతో ఒంటరితనాన్ని ఎదుర్కొన్నానని మాళవిక వెల్లడించింది. ఈ నెల ఎక్కువ భాగం చెన్నైలో షూటింగ్‌లో గడిచిందని, పని అద్భుతంగా ఉన్నప్పటికీ ఇంటి నుంచి దూరంగా ఉండటం ఊహించిన దానికంటే ఎక్కువగా తనను ప్రభావితం చేసిందని తెలిపింది. రోజు మొత్తం పని ముగిసిన తర్వాత ఖాళీ గదికి తిరిగి రావడం అంత సులభం కాదని ఆమె చెప్పింది. ఈ పరిస్థితుల్లో తన కుటుంబం చెన్నైకి రావడం తనకు ఎంతో ఉపశమనం ఇచ్చిందని ఆమె తెలిపింది. కొన్ని రోజులు తన కుటుంబం తనను కలవడానికి రావడం తన మనసుకు ఎంతో శాంతి ఇచ్చిందని, చెన్నై, మహాబలిపురంలో ఆలయాలను సందర్శించడం, స్థానిక వంటకాలను ఆస్వాదించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని తెలియజేసింది. ముఖ్యంగా తన అమ్మమ్మ కూడా రావడం మరింత ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొంది.
ఇక పాకెట్ నవెల్ చిత్రంతో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా, విజయ్ సేతుపతి మళ్లీ కలిసి పనిచేస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…