వినోదం

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో శివుడికి జలాభిషేకం నిర్వహిస్తున్న నటుడు అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా. Photo Credit: NDTV/Instagram.

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు అక్షయ్ కుమార్ తన అత్త డింపుల్ క‌పాడియాతో కలిసి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించి శివుడి ఆశీస్సులు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు కనిపించారు. అక్షయ్ సంప్రదాయ తెలుపు దుస్తుల్లో కనిపించగా, డింపుల్ గులాబీ రంగు చీరలో దర్శనమిచ్చారు. ఒక వీడియోలో ఇద్దరూ కలసి జలాభిషేకం కోసం నీటితో నిండిన పాత్రను పట్టుకుని పూజలు చేస్తుండగా, మరొక వీడియోలో అక్షయ్ నంది విగ్రహం ఎదుట‌ నమస్కరిస్తూ తన కోరికలను చెవిలో చెప్పడం కనిపించింది.

గ‌తంలో అక్ష‌య్‌పై డింపుల్ వ్యాఖ్య‌లు..

అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ ప్రారంభంలో పరిస్థితి అంత సాఫీగా లేదని గతంలో వెల్లడైంది. తన కుమార్తె ట్వింకిల్ ఖ‌న్నా అక్షయ్‌ను వివాహం చేసుకోవడంపై మొదట్లో సందేహాలు ఉన్నాయని డింపుల్ గ‌తంలో చెప్పారు. 2024లో ఫిక్కి ఫ్లో జైపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మొదట్లో త‌న కుమార్తె అతన్ని పెళ్లి చేసుకోవడంపై త‌న‌కు సందేహాలు ఉండేవ‌ని, కానీ ఇప్పుడు చూస్తే అతను ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తిగా ఉన్నాడ‌ని అన్నారు. అతను ఒక గొప్ప మనిష‌ని, చాలా సాధారణంగా అందరితో కలిసిపోతాడ‌ని, అతని సరదా స్వభావం చాలా ప్రత్యేకం అని అన్నారు.

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా 2001లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్ అనే కుమారుడు, నితారా అనే కుమార్తె ఉన్నారు. ఇక భూత్ బంగ్లా చిత్రంలో ప‌రేష్ రావ‌ల్‌, రాజ్‌పాల్ యాద‌వ్‌, ట‌బు, వామికా గ‌బ్బి, జిష్షు సేన్‌గుప్తా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్‌, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM