ఆంధ్ర‌ప్ర‌దేశ్

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

తాడేపల్లిలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. Photo Credit: YSR Congress Party/X.

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము వ్య‌తిరేక‌మ‌ని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. బుధ‌వారం (ఏప్రిల్ 1, 2026) తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ అమ‌రావ‌తి పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు. తాము అమ‌రావ‌తితో స‌హా ఏ ప్రాంతానికీ వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో అతి పెద్ద స్కామ్‌కు అమ‌రావ‌తి రాజ‌ధానిగా మారింద‌ని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబు కేవ‌లం త‌న స్కాముల కోసం భావోద్వేగాలు రెచ్చ‌గొడుతున్నార‌ని అన్నారు. రాజ‌ధాని విష‌యంలోనే కాద‌ని, ఏ విష‌యంలోనైనా చంద్ర‌బాబులో ఆచ‌ర‌ణాత్మ‌క ధోర‌ణి, ప్రాక్టికాలిటీ అనేది క‌నిపించ‌ద‌ని, అది ఉండి ఉంటే ఇప్ప‌టికే రాజ‌ధాని నిర్మాణం అయి ఉండేద‌న్నారు. రాజ‌ధానిలో చంద్ర‌బాబు దోపిడీ మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని, ప్ర‌తి ప‌నిలో ఎంత దోపిడీ చేసిందీ త్వ‌ర‌లోనే ప్ర‌పంచానికి తెలుస్తుంద‌న్నారు.

దోపిడీని ప్ర‌శ్నించ‌కూడ‌దా..

అసెంబ్లీ, హైకోర్టు భ‌వ‌నాల్లోనూ చంద్ర‌బాబు హైలెవ‌ల్ క‌ర‌ప్ష‌న్‌కు పాల్ప‌డ్డార‌ని జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేశారు. అమ‌రావతిలో రోడ్లైనా, మురుగునీటి కాలువ‌లైనా, సివ‌రేజి ప్లాంట్లైనా అవినీతిమ‌యంగా మారాయ‌న్నారు. కేవ‌లం స‌చివాల‌యం ట‌వ‌ర్లు, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోస‌మే రూ.401 కోట్లు పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఫ్లై ఓవ‌ర్ కోస‌మే కిలోమీట‌ర్‌కు రూ.170 కోట్లు పెడుతున్నార‌ని అన్నారు. త‌మ హయంలో విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ ఫ్లై ఓవ‌ర్‌కు కిలోమీట‌ర్‌కు రూ.35 కోట్లు పెట్టామ‌ని గుర్తు చేశారు. మిగిలిపోయిన సిక్స్ లేన్ రోడ్డుకు అమ‌రావ‌తిలో రూ.53 కోట్లు పెడుతున్నార‌ని, నేష‌న‌ల్ హైవేల్లో సిక్స్ లేన్ కోసం స‌గ‌టు ఖ‌ర్చు రూ.20 కోట్లు మాత్ర‌మేన‌ని తెలిపారు. ఈ దోపిడీని ప్ర‌శ్నించ‌కూడ‌దా అన్నారు. అడిగితే ఎదురుదాడి చేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. అమ‌రావ‌తికి వ్య‌తిరేకం అని ఎదురుదాడి చేస్తున్నార‌ని తెలిపారు.

సూప‌ర్ సిక్స్ హామీలు మోసాలుగా మిగిలిపోయాయి..

చంద్ర‌బాబు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలు మోసాలుగా మిగిలిపోయాయ‌ని జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు ల‌క్ష ఎక‌రాల అమ‌రావ‌తికి రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌ను ఎప్పుడు పెట్ట‌గ‌లుగుతార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రిగా, బాధ్య‌త‌గా చేయాల్సిన మంచి ఎలా జ‌రుగుతుంద‌ని అన్నారు. ఉద్యోగ‌స్తుల‌కు రూ.36వేల కోట్లు బ‌కాయిలు ఉన్నాయ‌ని, అమ‌రావ‌తిలో భ‌యంక‌ర‌మైన అవినీతి, దోపిడీ జ‌రుగుతుంద‌ని ఆరోపించారు. 2018లో ఏ ప‌నులు ఎవ‌రు చేశారో, 2024లో టెండ‌ర్లు ర‌ద్దు చేసిన త‌రువాత కూడా మళ్లీ అవే కంపెనీల‌కు ప‌నులు అప్ప‌గిస్తున్నార‌ని పేర్కొన్నారు. అమ‌రావ‌తి టెండ‌ర్ల‌లో గూడుపుఠాణి జ‌రిగింద‌ని, మాఫియాగా ఏర్ప‌డ్డార‌ని అన్నారు. స్కాముల కోసం అమ‌రావ‌తి మీద చంద్ర‌బాబు అప్పులు చేస్తున్నార‌ని, అప్పులు తెచ్చి కుమ్మ‌రించ‌డం వ‌ల్ల దాని ప్ర‌భావం ఇప్ప‌టికే స్టార్ట్ అయింద‌ని అన్నారు.

చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డం ఏపీ ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌మ‌ని జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న‌స‌భ‌లో అమ‌రావ‌తి తీర్మానం ఒక డ్రామా అని, రాజ్యాంగంలో ఎక్క‌డా రాజ‌ధాని అన్న ప‌ద‌మే లేద‌ని తెలిపారు. చంద్ర‌బాబు దృష్టిలో పాల‌న అంటే దోపిడీ, అవినీతేన‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తిపై ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM