ఆంధ్ర‌ప్ర‌దేశ్

జగన్ అడిగితే టికెట్ నేనే కొనిస్తా.. క్రికెట్ మ్యాచ్‌పై లోకేష్ సెటైర్లు!

భార‌త్ ఫైన‌ల్ చేరితే జ‌గ‌న్ కావాలంటే టిక్కెట్ కొంటాన‌న్న లోకేష్. Photo Credit: Nara Lokesh/X.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఫైన‌ల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తాన‌ని, కావాలంటే వైఎస్ జ‌గ‌న్‌కు కూడా ఓ టిక్కెట్‌ను తానే కొనుగోలు చేస్తాన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. సోమ‌వారం మీడియా ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన చిట్ చాట్‌లో లోకేష్ మాట్లాడుతూ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఒక వేళ ఫైన‌ల్‌కు వెళితే కచ్చితంగా స్టేడియంలోనే మ్యాచ్‌ను చూస్తాన‌ని, త‌న‌కు క్రికెట్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, త‌న‌కు దేశ‌భ‌క్తి కూడా ఎక్కువేన‌ని అన్నారు. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఆ మ్యాచ్ చూడాల‌ని అనిపిస్తే తాను వ్య‌క్తిగ‌తంగా మ్యాచ్‌కు ఓ టిక్కెట్‌ను స్వ‌యంగా కొని అంద‌జేస్తాన‌ని తెలిపారు. ఇటీవ‌ల లోకేష్ భార‌త్‌-పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు శ్రీ‌లంక‌లోని కొలంబోకు వెళ్లగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే లోకేష్ మ‌ళ్లీ ఈ విష‌యంపై మాట్లాడారు.

స్ప‌ష్ట‌త ఇచ్చిన మంత్రి లోకేష్‌..

మంత్రి నారా లోకేష్ కొలంబోలోని ఆర్‌.ప్రేమ‌దాస స్టేడియంలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా నిర్వ‌హించిన‌ భార‌త్-పాక్ మ్యాచ్‌ను వీక్షించిన అనంత‌రం రాత్రికి రాత్రే మ‌ళ్లీ అమ‌రావ‌తి చేరుకున్నారు. త‌రువాత ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన అమ‌రావ‌తికి వ‌చ్చిన మైక్రోసాఫ్ట్ కో ఫౌండ‌ర్ బిల్ గేట్స్‌ను రిసీవ్ చేసుకున్నారు. అనంత‌రం మ‌ళ్లీ రాత్రికి రాత్రే ఢిల్లీలో ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే కొలంబోలో మ్యాచ్‌ను వీక్షించేందుకు లోకేష్ ప్ర‌జాధ‌నాన్ని వృథా చేసి వెళ్లార‌ని, ప్ర‌జ‌ల డ‌బ్బును లోకేష్ త‌న విలాసాల‌కు ఖ‌ర్చు చేస్తున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీంతో లోకేష్ ఆ విష‌యంపై త‌న ఎక్స్ ఖాతాలో స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. కొలంబోకు త‌న ఖ‌ర్చుల‌తోనే వెళ్లాన‌ని, ప్ర‌జాధ‌నాన్ని వృథా చేయ‌లేద‌ని తెలిపారు. అయితే మ‌రోసారి లోకేష్ ఈ విష‌యంపై మాట్లాడ‌డంతో దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారోన‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM