వినోదం

ట్రోలర్లకు సమంత వార్నింగ్.. ఇక సహించేది లేదు! మే 15న మూవీ రిలీజ్..

‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్లలో ట్రోలర్లపై విరుచుకుపడ్డ సమంత. Photo Credit: Samantha/Instagram.

త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌తను వ్యాపింప‌జేసే వారిని ఇక‌పై ఏమాత్రం స‌హించ‌బోన‌ని స‌మంత అన్నారు. తాను లీడ్ రోల్‌లో న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న మా ఇంటి బంగారం అనే మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆమె తాజాగా ఫ్యాన్స్‌తో సోష‌ల్ మీడియాలో చిట్ చాట్ నిర్వ‌హించారు. ఈ మూవీ వ‌చ్చే మే 15వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతుంద‌ని చెబుతూ ఆమె సినిమా పోస్ట‌ర్‌ను కూడా ఈ సంద‌ర్భంగా ఆవిష్క‌రించారు. ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెబుతూనే త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో త‌న‌కు ఎదుర‌వుతున్న స‌వాళ్లు, సినిమా రంగంలో ఎదుర‌వుతున్న ఒత్తిడి వంటి అంశాల‌పై ఆమె మాట్లాడారు.

వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తే స‌హించ‌ను..

సోష‌ల్ మీడియాలో ఎవ‌రైనా త‌న‌ను ట్రోల్ చేసినా, పొగిడినా ఇక‌పై ప‌ట్టించుకోన‌ని, అవి త‌న‌పై ఎంత మాత్రం ప్ర‌భావం చూపించ‌లేవ‌ని సమంత అన్నారు. అయితే త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై వ్య‌తిరేక‌త‌ను ప్ర‌చారం చేస్తే మాత్రం స‌హించ‌న‌ని, అలాంటి వారిని వెంట‌నే బ్లాక్ లిస్ట్‌లో పెడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాంటి వారికి త‌న జీవితంలో స్థానం ఇవ్వ‌ద‌లుచుకోలేద‌ని, అన‌వ‌స‌రంగా వ్య‌తిరేక‌త‌ను ప్ర‌చారం చేసేవారికి తాను స‌పోర్ట్ చేయ‌న‌ని తెలిపారు. సినిమా రంగంలో త‌న‌కు ఎదుర‌వుతున్న ఒత్తిడిపై కూడా స‌మంత మాట్లాడారు. తాను ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్త‌మేన‌ని, కానీ త‌ర‌చూ మెడిటేష‌న్ చేయ‌డం ద్వారా ఒత్తిడిని త‌గ్గించుకుంటున్నానని తెలిపారు. ఒత్తిడిగా ఉన్న‌ట్లు అనిపిస్తే వెంట‌నే మెడిటేష‌న్ చేస్తాన‌ని, దీంతో ప్ర‌శాంత‌త‌, సంతోషం ల‌భిస్తాయ‌ని అన్నారు.

నందిని రెడ్డితో మూడో సినిమాగా..

కాగా నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా స‌మంత నిత్యం ఏదో ఒక రూపంలో తీవ్ర‌మైన ట్రోలింగ్‌ను, వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటూనే వ‌స్తున్నారు. ఇటీవ‌లే ఆమె ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న సంద‌ర్భంలోనూ ఆమె సోష‌ల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గుర‌య్యారు. అయితే ఇక‌పై ట్రోలింగ్‌ను ఎంత మాత్రం స‌హించ‌న‌ని స‌మంత స్ప‌ష్టంగా చెప్ప‌డంతో ఆమె భ‌విష్య‌త్తులో అలా చేసేవారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటారేమోన‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు. ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే ఆమె న‌టిస్తూ, నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమాకు ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా, ఈ ఇద్ద‌రి కాంబోలో ఇది మూడో ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోంది. దీంతో స‌మంత ప్ర‌స్తుతం ఈ చిత్ర నిర్మాణ కార్య‌క్ర‌మాల‌తోపాటు ఇందులో న‌టించ‌డంలోనూ బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM