తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ సినిమాకు మణిరత్నం ఓకే చేశారని సమాచారం. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం విజయ్ సేతుపతితో కలిసి నటించేందుకు సాయిపల్లవి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు గాను ముందుగా విజయ్ స్థానంలో ధనుష్‌ను అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రెమ్యునరేషన్ విషయంలో తేడా వచ్చి ధనుష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. అయితే ఎట్టకేలకు విజయ్ సేతుపతిని ఈ సినిమాకు లీడ్ రోల్‌లో తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సాయిపల్లవిని ఈ సినిమాకు ఫీమేల్ లీడ్‌గా మణిరత్నం ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని సినీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆమె ఇకపై వరుస సినిమాలతో సందడి చేయనుందని అర్థమవుతోంది.
థగ్ లైఫ్ మూవీ నిరాశ పరిచిన అనంతరం దర్శకుడు మణిరత్నం తెరకెక్కించాలనుకున్న ఈ మూవీకి అసలు ధనుష్, విజయ్ సేతుపతి కంటే ముందుగా కూడా పలువురు నటులను సంప్రదించినట్లు తెలిసింది. దీనికి మణిరత్నం ముందుగా తమిళ నటుడు శింబును హీరోగా అనుకున్నట్లు తెలుస్తోంది. తరువాత కొంత కాలం పాటు ధ్రువ్ విక్రమ్ పేరు కూడా వినిపించింది. కానీ చివరకు విజయ్ సేతుపతిని మణిరత్నం ఓకే చేశారు. దీంతో విజయ్ సేతుపతికి మణిరత్నంతో ఇది రెండో సినిమా కానుంది. అంతకు ముందు మణిరత్నంతో విజయ్ చీక్కా చివంత వానమ్ అనే మూవీని చేశారు. ఇక విజయ్ సేతుపతిని మెయిన్ లీడ్ రోల్‌కు తీసుకున్న అనంతరం మణిరత్నం ముందుగా రుక్మిణి వసంత్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన సాయిపల్లవిని ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
మణిరత్నం, విజయ్ సేతుపతి మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభించనున్నారని టాక్ నడుస్తోంది. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ఈ వివరాలన్నింటిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే సాయిపల్లవి ఇప్పటికే బాలీవుడ్‌లో అనేక సినిమాలతో బిజీగా ఉంది. ఆమె హిందీలో ఏక్ దిన్ అనే మూవీలో మీరా అనే పాత్రలో నటిస్తుండగా, రామాయణ పార్ట్ 1, 2 మూవీల్లో సీతగా చేస్తోంది. తమిళంలో డీ55 అనే సినిమాలోనూ ఆమె యాక్ట్ చేస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా ఇప్పుడు మణిరత్నం సినిమా కూడా ఆమె చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కన్‌ఫామ్ అయితే వచ్చే 3 ఏళ్లలో సాయిపల్లవి పేరు దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో మారుమోగి పోవడం ఖాయంగా కనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…