క్రికెట్

బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్.. టీమిండియాపై గవాస్కర్ ఫైర్!

భారత బ్యాటర్ల వైఖరిపై విమర్శలు గుప్పించిన సునీల్ గవాస్కర్. Photo Credit: ICC/Sunil Gavaskar/X.

భార‌త క్రికెట్ జ‌ట్టు బ్యాట‌ర్ల‌కు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంద‌ని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్‌ను ఎటు ప‌డితే అటు ఊప‌డం కాద‌ని క్రికెట్ దిగ్గ‌జం, కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 22, 2026) అహ్మ‌దాబాద్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంపై గ‌వాస్క‌ర్ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న జియోస్టార్ చాన‌ల్‌లో మాట్లాడుతూ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు మిల్ల‌ర్‌, బ్రెవిస్ ఆడిన ఆట‌తీరును చూసి కూడా భార‌త బ్యాట‌ర్లు త‌మ పంథాను మార్చుకోలేద‌ని అన్నారు. మిల్ల‌ర్‌, బ్రెవిస్‌ల మాదిరిగా పార్ట్‌న‌ర్‌షిప్‌ను నిర్మించి ఆట‌ను ఆడాల‌ని, అదే స‌రైన విధాన‌మ‌ని అన్నారు. సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ అనేక త‌ప్పులు చేసింద‌న్న ఆయ‌న‌, రానున్న మ్యాచ్‌ల‌లో ప‌లు మార్పులు చేసి స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటే త‌ప్ప గెల‌వ‌లేర‌ని అన్నారు.

తెలివిగా వ్య‌వ‌హ‌రించిన సౌతాఫ్రికా..

సౌతాఫ్రికా బ్యాట‌ర్లు ఆడిన‌ట్లు భార‌త బ్యాటర్లు పార్ట్‌న‌ర్‌షిప్‌ను నిర్మించ‌లేద‌ని, భార‌త ప్లేయ‌ర్లు మైదానంలోకి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో వ‌చ్చార‌ని గ‌వాస్క‌ర్ అన్నారు. వారు త‌మ బ్యాట్‌ల‌ను ఎటు ప‌డితే అటు ఊపి వికెట్ల‌ను పారేసుకున్నార‌ని, ఈ విష‌యంలో సౌతాఫ్రికా చాలా తెలివిగా వ్య‌వ‌హరించి వారిని ఔట్ చేసింద‌ని అన్నారు. అన్ని విధాలుగా సౌతాఫ్రికా జ‌ట్టు ఈ విజ‌యానికి అర్హమైంద‌ని అన్నారు. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల ఇన్నింగ్స్‌ను చూసి భార‌త బ్యాట‌ర్లు మ్యాచ్ కండిష‌న్ల‌ను అర్థం చేసుకోలేక‌పోయార‌ని, ఇన్నింగ్స్‌లో ప్ర‌తి బంతిని బౌండ‌రీకి త‌రలించాల‌నే ఒకే ఆలోచ‌న‌తో ఆడార‌ని, అందుక‌నే త్వ‌ర‌గా ఔట‌య్యార‌ని, టీ20 క్రికెట్‌ను ఆడే ప‌ద్ధ‌తి అది కాద‌ని గ‌వాస్క‌ర్ పేర్కొన్నారు.

తిల‌క్ ఆట‌తీరు స‌రిగ్గా లేదు..

మ్యాచ్‌లో సొంత తెలివితేట‌ల‌ను ఉప‌యోగించ‌డ‌మే కాదు, ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఎలా ఆడుతుంద‌న్న విష‌యాన్ని కూడా గ‌మ‌నించాల‌ని గ‌వాస్క‌ర్ భార‌త జ‌ట్టుకు సూచించారు. ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్ల ఆట‌తీరును అర్థం చేసుకోలేద‌ని భార‌త బ్యాట‌ర్ల‌ను విమ‌ర్శించారు. అహ్మ‌దాబాద్ లాంటి క్లిష్ట‌మైన పిచ్‌పై సౌతాఫ్రికా బ్యాట‌ర్లు మెరుగ్గా రాణించార‌ని, భార‌త బ్యాట‌ర్లు ఎందుకు ఆడ‌లేక‌పోయార‌ని ప్ర‌శ్నించారు. భార‌త ప్లేయ‌ర్లు ఈగోను ప్ర‌ద‌ర్శించార‌ని దుయ్య‌బ‌ట్టారు. తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన ఆటగాడేన‌ని, కానీ ఈ మ్యాచ్‌లో అత‌ను ఆడిన తీరు స‌రిగ్గా లేద‌ని అన్నారు. కిష‌న్ మొద‌టి ఓవ‌ర్‌లోనే ఔట్ కావ‌డంతో కావ‌ల్సిన రన్ రేట్ 9.5గా ఉంద‌ని, అది 15 లేద‌ని, అంత‌లా ప్ర‌తి బాల్‌ను షాట్ ఆడాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని గ‌వాస్క‌ర్ ప్ర‌శ్నించారు.

మార్పులు అవ‌సరం..

తిల‌క్ వ‌ర్మ ఇంకాస్త సేపు స‌మ‌యం కేటాయించి ఉండాల్సింద‌ని గ‌వాస్క‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. అభిషేక్ ఫామ్‌లో లేడు క‌నుక తిల‌క్ కాసేపు ఆడి పార్ట్‌న‌ర్‌షిప్‌ను నిర్మించి ఉంటే 6 ఓవ‌ర్ల ప‌వ‌ర్ ప్లే పూర్త‌య్యేద‌ని, త‌రువాత కండిష‌న్‌కు అనుగుణంగా ఆడి ఉంటే స‌రిపోయేద‌ని అన్నారు. ప‌వ‌ర్ ప్లేలో 6 ఓవ‌ర్ల‌కు 70 ప‌రుగులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, 55-60 ప‌రుగులు చేసినా ఇన్నింగ్స్ ను చ‌క్క‌గా నిర్మించుకోవ‌చ్చ‌ని అన్నారు. కానీ భార‌త బ్యాట‌ర్లు నిర్ల‌క్ష్య‌పూరిత షాట్‌ల‌ను ఆడి మొత్తం టీంను ప‌త‌నం దిశ‌గా న‌డిపించార‌ని విచారం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే మ్యాచ్‌ల‌లో సుంద‌ర్ కు బ‌దులుగా అక్ష‌ర్‌ను తీసుకోవాల‌ని, అత‌ను గ‌తంలో జ‌రిగిన 2024 టీ20 వ‌ర‌ల్డ్ కప్ ఫైన‌ల్‌లో ఇదే సౌతాఫ్రికాపై అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడ‌ని, క‌నుక అక్ష‌ర్ ఉంటే టీం బ్యాలెన్స్ అవుతుంద‌ని, సుంద‌ర్ స‌రిగ్గా రాణించ‌లేక‌పోతున్నాడ‌ని గ‌వాస్క‌ర్ సూచ‌న‌లు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM