వినోదం

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ విడుదల తేదీని వెల్లడించిన రామ్ చరణ్. Photo Credit: Ram Charan Fans Club/Instagram.

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. గేమ్ చేంజ‌ర్ ఫ్లాప్ అవ‌డంతో చ‌రణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. వారి అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగానే ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్ అన్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే సినిమా విడుద‌ల తేదీపై మాత్రం అందరిలోనూ సందేహం నెల‌కొన‌గా రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ఆ విష‌యంపై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. పెద్ది అనుకున్న తేదీకే వ‌స్తుంద‌ని చెప్పారు. రాకాస ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌, మెగా డాట‌ర్ నిహారిక ఆ మూవీ యూనిట్‌తో క‌లిసి త‌న సోద‌రుడు రామ్ చ‌ర‌ణ్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మాట‌ల మ‌ధ్య‌లో చ‌రణ్ త‌న మూవీ విడుద‌ల తేదీపై క్లారిటీ ఇచ్చారు. అనుకున్న తేదీకే వ‌స్తుంద‌ని తెలిపారు. ఏప్రిల్ 30, 2026న రిలీజ్ అవుతుంద‌న్నారు. త‌న సినిమాను కూడా ప్ర‌మోట్ చేయాల‌ని నిహారిక‌ను కోరారు.

అనేక సందేహాలు.. క్లారిటీ వ‌చ్చేసిందిగా..

పెద్ది చిత్రం విడుద‌ల‌పై ఇటీవ‌లి కాలంలో అనేక సందేహాలు, అనుమానాలు నెల‌కొన్నాయి. చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయాల్సి ఉండ‌గా, అనుకోని కార‌ణాల వ‌ల్ల ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీన కూడా మూవీ విడుద‌ల కావ‌ట్లేద‌ని కొన్ని రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. రీసెంట్‌గా మ‌రో మూవీ ఈవెంట్‌లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న పెద్ది వ‌స్తుంద‌ని మాట్లాడేస‌రికి అభిమానులు కంగారు ప‌డ్డారు. అయితే త‌న‌కు తెలియ‌కుండానే అలా అన్నాన‌ని ఆయ‌న త‌రువాత క్లారిటీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ పెద్ది విడుద‌ల తేదీపై అంద‌రిలోనూ అనుమానాలు మాత్రం తీర‌లేదు. అయితే నిహారిక త‌న రాకాస టీమ్‌తో క‌లిసి చ‌ర‌ణ్‌ను మీట్ అయిన‌ప్పుడు ఆయ‌న మాట‌ల మ‌ధ్య‌లో పెద్ది లేట్ అవ్వట్లేద‌ని చెప్పారు. అనుకున్న తేదీకే ఏప్రిల్ 30, 2026న రిలీజ్ అవుతుంద‌ని, అయితే అభిమానుల్లో విడుద‌ల తేదీపై సందేహం ఉంద‌ని, దాన్ని క్లారిఫై చేసేందుకు స‌హాయం చేయాల‌ని ఆయ‌న నిహారిక‌ను కోరారు. ఈ సందర్భంగా వారి మ‌ధ్య ఫ‌న్నీ సంభాష‌ణ కొన‌సాగింది. అయితే పెద్ది ఇక అనుకున్న తేదీకే వ‌స్తుంద‌ని క్లారిటీ రావ‌డంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

నెల రోజులే ఉందిగా..

పెద్ది సినిమాకు ఇంకా నెల కూడా లేదు. అయినా ఇప్ప‌టికీ షూటింగ్ కొన‌సాగుతోంది. ఒక‌టి రెండు పాట‌లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని టాక్‌. మ‌రి షూటింగ్ పూర్తి చేసి, పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి అందుకు త‌గిన‌ట్లే ప్ర‌మోష‌న్లు చేయ‌డానికి టైమ్ ఉంటుందా..? లేదంటే చివ‌రి నిమిషంలో మ‌ళ్లీ వాయిదా అని చెప్పి ఏమైనా షాకిస్తారా..? అని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు. ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ క‌పూర్ న‌టిస్తుండ‌గా తెలుగులో ఆమెకు ఇది రెండో చిత్రం. అంత‌కు ముందు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో దేవ‌ర మూవీ చేసిన ఈ బ్యూటీ మొద‌టి ప్ర‌య‌త్నంలోనే హిట్ కొట్టేసింది. దీంతో ఈ మూవీ కూడా హిట్ అవుతుంద‌ని ఆశిస్తోంది. ఇక చ‌ర‌ణ్‌కు జాన్వీతో ఇదే తొలి సినిమా కాగా ఇందులో క‌న్న‌డ హీరో శివ‌రాజ్ కుమార్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే జ‌గ‌పతి బాబు, దివ్యేందు కూడా యాక్ట్ చేస్తున్నారు. దీనికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా, పాటలు ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయ్యాయి. రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రి సినిమా ఏమేర అల‌రిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM