హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. అందులో ఆయన ఓ వీడియోను కూడా ఇచ్చారు. దాంట్లో పూజ మందిరంలోని హనుమాన్ విగ్రహాన్ని సూర్య కిరణాలు స్పృశించడం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఘటనలు ఆలయాల్లోనే జరుగుతాయని, కానీ తన ఇంట్లో తన పూజ మందిరంలో ఇలా జరగడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఆంజనేయ స్వామికి పరమ భక్తుడైన చిరంజీవి హనుమాన్ జయంతి నాడు ఈ దృశ్యం తన ఇంట్లో ఆవిష్కృతం కావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతోకాలంగా మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామికి పరమభక్తుడిగా ఉన్నారు. ఆయన సినిమాల్లోనూ హనుమాన్‌ను పూజించినట్లు పలు సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. గురువారం (ఏప్రిల్ 2, 2026) హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. తన ఇంట్లోని పూజ మందిరంలో చోటు చేసుకున్న ఆ అపురూప దృశ్యాన్ని వీడియోలో బంధించి దాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లకు చూపించారు. ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి కిరణాలు తమ ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నానని చెబుతూ ఆయన ఆ వీడియోను షేర్ చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా తమ పూజ మందిరంలో జరిగిన ఒక విశేషాన్ని అందరితోనూ పంచుకోవాలని ఈ వీడియోను షేర్ చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్య కిరణాలు సప్త వర్ణాలుగా మారి తమ పూజ మందిరంలో ఉన్న హనుమంతుడిని స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమని అన్నారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి పడి మెరిసిన అద్బుతాన్ని చూశామని, అలాగే కోణార్క్, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్య కిరణాలు ఆ భగవంతున్ని తాకే విశేషం అందరికీ తెలిసిందేనని అన్నారు. అలాంటి దైవానుభూతి తమ ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి చిరుకు బంపర్ హిట్ ఇచ్చారు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీతోపాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అలాగే ఇంకో మూవీని కూడా ఆయన ప్లాన్ చేశారు. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, ఇతర రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి.
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…