పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను చూపించారు. భారీ ఎత్తున ప్రేక్షకులు ఈ లుక్‌కు ఫిదా అయ్యారు. అయితే కొందరు అభిమానులు మాత్రం ఏఐ ద్వారా ఇంకా పర్‌ఫెక్ట్‌గా రాముడి లుక్‌ను ఎలా చూపించవచ్చో తమ క్రియేటివిటీని ఉపయోగించి ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రఖ్యాత హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ హాన్స్ జిమ్మర్‌తోపాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా సంయుక్తంగా మ్యూజిక్‌ను అందిస్తున్నారు. అయితే రామాయణ సినిమాకు ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ తీసుకుంటున్న పారితోషికం వార్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అది అధికారిక సమాచారం కాకపోయినా ఆయన ఈ చిత్రానికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిసి అభిమానులు షాకవుతున్నారు.
రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి, రావణుడి పాత్రలో కన్నడ నటుడు యష్ నటిస్తున్నారు. మొత్తం రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ తొలి పార్ట్‌ను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనుండగా, రెండో పార్ట్‌ను వచ్చే ఏడాది దీపావళి నాడు రిలీజ్ చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే అంతటి భారీ బడ్జెట్ పెట్టినా క్వాలిటీ ఇంకా బాగా రాలేదని విమర్శలు వస్తున్నాయి. మరి విడుదల వరకు క్వాలిటీని మార్చుతారా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి రెహమాన్ రికార్డు స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఆయన ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయి రెమ్యునరేషన్‌ను ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సంగీత దర్శకుడికీ ఇవ్వలేదు. అలాగే రిలీజ్ అనంతరం వచ్చే కలెక్షన్స్ లాభాల్లోనూ రెహమాన్ వాటా అడిగినట్లు తెలిసింది.
రామాయణ గ్లింప్స్ విషయానికి వస్తే ఇందులోని గ్రాఫిక్స్‌ను గతంలో ప్రభాస్ రాముడిగా వచ్చిన ఆదిపురుష్ చిత్రంలోని గ్రాఫిక్స్‌తో పోలుస్తూ మళ్లీ ఆ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రామాయణలో పుష్పక విమానం సన్నివేశం అత్యద్భుతంగా ఉండగా, గతంలో ఆది పురుష్ చిత్రంలో రావణుడి క్యారెక్టర్ చేసిన సైఫ్ అలీ ఖాన్ ఎక్కిన విచిత్రమైన వికృత జీవి సన్నివేశాన్ని ఇప్పటి చిత్రంతో పోలుస్తూ ఆదిపురుష్‌ను మళ్లీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఏ చిత్రంలో గ్రాఫిక్స్ బాగున్నా దాంతో ఆదిపురుష్‌ను పోల్చి చూస్తూ ఆ సినిమాను ట్రోల్ చేయడం ఎక్కువైపోయింది. అయితే ప్రస్తుత రామాయణ చిత్రంలో గ్రాఫిక్స్ మాత్రం బాగుండడంతో ఈ మూవీ ఆదిపురుష్ లా ఉండబోదని ప్రేక్షకులకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మరి రామాయణ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…