‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అందులో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ ఫ‌స్ట్ లుక్‌ను చూపించారు. భారీ ఎత్తున ప్రేక్ష‌కులు ఈ లుక్‌కు ఫిదా అయ్యారు.

April 4, 2026 12:10 PM
AR Rahman and Hans Zimmer music collaboration for Ramayana movie.
నితేశ్ తివారి ‘రామాయణ’ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హాన్స్ జిమ్మర్. Photo Credit: AR Rahman/Ramayana Movie/X.

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అందులో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ ఫ‌స్ట్ లుక్‌ను చూపించారు. భారీ ఎత్తున ప్రేక్ష‌కులు ఈ లుక్‌కు ఫిదా అయ్యారు. అయితే కొంద‌రు అభిమానులు మాత్రం ఏఐ ద్వారా ఇంకా ప‌ర్‌ఫెక్ట్‌గా రాముడి లుక్‌ను ఎలా చూపించ‌వ‌చ్చో త‌మ క్రియేటివిటీని ఉప‌యోగించి ఫొటోలు, వీడియోల‌ను క్రియేట్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్ర‌ఖ్యాత హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఆస్కార్ విన్న‌ర్ హాన్స్ జిమ్మ‌ర్‌తోపాటు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ కూడా సంయుక్తంగా మ్యూజిక్‌ను అందిస్తున్నారు. అయితే రామాయ‌ణ సినిమాకు ప్ర‌స్తుతం ఏఆర్ రెహ‌మాన్ తీసుకుంటున్న పారితోషికం వార్త సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అది అధికారిక స‌మాచారం కాక‌పోయినా ఆయ‌న ఈ చిత్రానికి తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ గురించి తెలిసి అభిమానులు షాక‌వుతున్నారు.

రెహ‌మాన్ రెమ్యున‌రేష‌న్ అంతా..?

రూ.4వేల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రంలో ర‌ణ‌బీర్ క‌పూర్ రాముడిగా న‌టిస్తుండ‌గా, సీత‌గా సాయిప‌ల్ల‌వి, రావ‌ణుడి పాత్ర‌లో క‌న్న‌డ న‌టుడు య‌ష్ న‌టిస్తున్నారు. మొత్తం రెండు పార్టులుగా వ‌స్తున్న ఈ మూవీ తొలి పార్ట్‌ను ఈ ఏడాది దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నుండ‌గా, రెండో పార్ట్‌ను వ‌చ్చే ఏడాది దీపావ‌ళి నాడు రిలీజ్ చేయ‌నున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన చిత్ర గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. అయితే అంత‌టి భారీ బ‌డ్జెట్ పెట్టినా క్వాలిటీ ఇంకా బాగా రాలేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి విడుద‌ల వ‌ర‌కు క్వాలిటీని మార్చుతారా అన్న‌ది చూడాలి. ఇక ఈ చిత్రానికి రెహ‌మాన్ రికార్డు స్థాయిలో పారితోషికం అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స్థాయి రెమ్యున‌రేష‌న్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏ సంగీత ద‌ర్శ‌కుడికీ ఇవ్వ‌లేదు. అలాగే రిలీజ్ అనంత‌రం వ‌చ్చే క‌లెక్ష‌న్స్ లాభాల్లోనూ రెహ‌మాన్ వాటా అడిగిన‌ట్లు తెలిసింది.

ఆదిపురుష్‌పై మ‌ళ్లీ ట్రోల్స్‌..

రామాయ‌ణ గ్లింప్స్ విష‌యానికి వ‌స్తే ఇందులోని గ్రాఫిక్స్‌ను గ‌తంలో ప్ర‌భాస్ రాముడిగా వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రంలోని గ్రాఫిక్స్‌తో పోలుస్తూ మ‌ళ్లీ ఆ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రామాయ‌ణ‌లో పుష్ప‌క విమానం స‌న్నివేశం అత్య‌ద్భుతంగా ఉండ‌గా, గతంలో ఆది పురుష్ చిత్రంలో రావ‌ణుడి క్యారెక్ట‌ర్ చేసిన సైఫ్ అలీ ఖాన్ ఎక్కిన విచిత్ర‌మైన వికృత జీవి స‌న్నివేశాన్ని ఇప్ప‌టి చిత్రంతో పోలుస్తూ ఆదిపురుష్‌ను మ‌ళ్లీ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఏ చిత్రంలో గ్రాఫిక్స్ బాగున్నా దాంతో ఆదిపురుష్‌ను పోల్చి చూస్తూ ఆ సినిమాను ట్రోల్ చేయ‌డం ఎక్కువైపోయింది. అయితే ప్ర‌స్తుత రామాయ‌ణ చిత్రంలో గ్రాఫిక్స్ మాత్రం బాగుండడంతో ఈ మూవీ ఆదిపురుష్ లా ఉండ‌బోద‌ని ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. మ‌రి రామాయ‌ణ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment