వినోదం

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ టీజర్‌లో రణబీర్ కపూర్ దివ్యమైన రూపం. Photo Credit: World Of Ramayana/YouTube.

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి లుక్‌తోపాటు పలు సన్నివేశాల‌ను ప్రేక్షకులకు చూపించారు. పట్టాభిషేకం నుంచి పంచవటి అరణ్యవాసం వరకు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో ప్రశాంతత, గంభీరత, దివ్యత్వంతో ఆకట్టుకున్నారు. టీజర్ చివరలో రావణుడి పాత్రలో య‌ష్‌ చిన్న చూపు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. టీజర్ విడుదలకు ముందు ఆలియా భ‌ట్ సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా స్పందించారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తానని చెప్పిన ఆమె, తన భర్త రణబీర్ కపూర్ కృషికి మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను కోరారు. ఆ వీడియోలో ఆలియా మాట్లాడుతూ రామాయణ టీజ‌ర్‌ విడుదల కానుంద‌ని, తాను దాన్ని త‌న‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తాన‌ని, అందరూ దాన్ని తప్పకుండా సపోర్ట్ చేయాల‌ని, రణబీర్ చాలా అద్భుతంగా నటించాడ‌ని అన్నారు. ప్రేక్ష‌కులు చూసే రోజు కోసం తాను కూడా ఎదురుచూస్తున్నాన‌ని, ఇది నిజంగా అద్భుతంగా ఉంద‌ని అన్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం..

ఈ చిత్రం సుమారు రూ.4వేల‌ కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నిర్మాత న‌మిత్ మ‌ల్హోత్రా ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను ఆరు నుంచి ఏడు సంవత్సరాల క్రితమే ప్రారంభించగా ఈ స్థాయి సినిమా గురించి అప్పట్లో చాలామంది అనుమానించారు. రెండు భాగాలు కలిపి మొత్తం బడ్జెట్ దాదాపు 500 మిలియన్ డాలర్లు, అంటే రూ.4వేల‌ కోట్లకు పైగా ఉంటుంద‌ని, ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని రూపొందిస్తున్నామ‌ని, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరేలా చేస్తున్నామ‌ని ఆయన తెలిపారు.

సంగీతంలో అంతర్జాతీయ కలయిక..

ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రెహ‌మాన్‌, ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మ‌ర్ కలిసి అందిస్తున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. రెహ్మాన్ మాట్లాడుతూ ఇది త‌మ‌కు ఇద్దరికీ పెద్ద సవాల‌ని, ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన ఇతిహాసానికి సంగీతం అందిస్తున్నామ‌ని, ప్రతి భారతీయుడికి తెలిసిన కథను కొత్తగా ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఉంద‌ని చెప్పారు.

కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 అక్టోబర్‌లో దీపావళి సందర్భంగా విడుదల అవుతోంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్‌తో పాటు సాయిప‌ల్ల‌వి సీత‌గా న‌టిస్తుండ‌గా, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడి పాత్ర‌లో, ర‌వి దూబే ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అద్భుతం.. హనుమాన్ విగ్రహంపై సూర్య కిరణాలు!

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా త‌మ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్ర‌హంపై సూర్య కిర‌ణాలు ప‌డ‌డం త‌న…

Thursday, 2 April 2026, 11:37 AM

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM