Tabu : ఆ హీరో వల్లే టబు పెళ్లి చేసుకోలేదట.. సంచలన వ్యాఖ్యలు..!

November 5, 2021 6:34 PM

Tabu : సినీ ఇండస్ట్రీలో టబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక భాషలకు చెందిన చిత్రాల్లో నటించి ఒకప్పుడు నంబర్‌ వన్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పుడు తల్లి పాత్రలను పోషిస్తూ మళ్లీ తానేంటో మరోసారి నిరూపించుకుంటోంది. అయితే ప్రస్తుతం ఈమెకు 40 సంవత్సరాలు దాటినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరిగానే జీవిస్తోంది. అయితే ఈమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఈమె గతంలో నాగార్జునతో ఎంతో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

Tabu said that hero is the reason she is not married until now

 

నాగార్జున వల్లే పెళ్లి చేసుకోకుండా ఉందని ఈమె పెళ్లి గురించి కూడా పలువురు స్పందించారు. తాజాగా టబు స్పందిస్తూ.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఎవరు అనే విషయాన్ని బయటపెట్టింది. ఈమె ఇప్పటి వరకు ఒంటరిగా జీవించడానికి గల కారణం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్.. అంటూ షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.

అజయ్ దేవగన్.. నా సోదరుడు సమీర్ పక్కనే తిరుగుతూ ఉండేవాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే తిరుగుతూ.. నాతో ఎవరు మాట్లాడినా అజయ్ సహించేవాడు కాదు.. ఎప్పటికైనా నా మనసులో ఉన్న మాటను అజయ్‌ అర్థం చేసుకుంటాడని ఆశిస్తున్నాను.. అని టబు ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా అల వైకుంఠపురం సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment