శనివారం, జూలై 25, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపు..!

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 23వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపొందింది. చివ‌రి బంతి వ‌ర‌కు మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. గెలుపు కోసం…

T20 World Cup 2021 : ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపు..!

T20 World Cup 2021 : షార్జా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 23వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపొందింది. చివ‌రి బంతి వ‌ర‌కు మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. గెలుపు కోసం బంగ్లాదేశ్ తీవ్రంగా శ్ర‌మించింది. అయిన‌ప్ప‌టికీ విజ‌యం విండీస్‌ను వ‌రించింది. దీంతో బంగ్లాపై విండీస్ కేవ‌లం 3 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 west indies won by 3 runs against bangladesh in 23rd match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో విండీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది. నికోలాస్ పూర‌న్ 22 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సుల‌తో 40 ప‌రుగులు చేయ‌గా.. రోస్ట‌న్ చేజ్ 46 బంతుల్లో 2 ఫోర్ల‌తో 39 ప‌రుగులు చేశాడు. బంగ్లా బౌల‌ర్ల‌లో మ‌హెది హ‌స‌న్‌, ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌, షొరిఫుల్ ఇస్లామ్‌లు త‌లా 2 వికెట్లు తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. 5 వికెట్ల‌ను కోల్పోయి 139 ప‌రుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ల‌లో లైట‌న్ దాస్ 43 బంతుల్లో 4 ఫోర్ల‌తో 44 ప‌రుగులు చేయ‌గా.. మ‌హ్మ‌దుల్లా 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌల‌ర్ల‌లో ర‌విరాంపాల్‌, జేస‌న్ హోల్డ‌ర్‌, ఆండ్రూ ర‌స్సెల్‌, అకియ‌ల్ హొసెయిన్‌, డ్వానె బ్రేవోలు త‌లా 1 వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి