శనివారం, జూలై 25, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : పసికూన‌పై పాక్ గెలుపు.. ఓడినా పోరాట ప‌టిమ చూపిన న‌మీబియా..

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 31వ మ్యాచ్ లో ప‌సికూన న‌మీబియాపై పాకిస్థాన్ విజ‌యం సాధించింది. పాకిస్థాన్ విధించిన 190 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చూసినా…

T20 World Cup 2021 : పసికూన‌పై పాక్ గెలుపు.. ఓడినా పోరాట ప‌టిమ చూపిన న‌మీబియా..

T20 World Cup 2021 : అబుధాబి వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 31వ మ్యాచ్ లో ప‌సికూన న‌మీబియాపై పాకిస్థాన్ విజ‌యం సాధించింది. పాకిస్థాన్ విధించిన 190 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చూసినా న‌మీబియా బెదిరిపోలేదు. పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించింది. గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేసింది. 144 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. దీంతో న‌మీబియాపై పాకిస్థాన్ 45 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

T20 World Cup 2021  pakisthan won by 45 runs against namibia in 31st match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 189 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్‌ల‌లో మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ 79 ప‌రుగులు, బాబ‌ర్ అజం 70 ప‌రుగులు చేసి రాణించారు. మ‌రో బ్యాట్స్‌మ‌న్ మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్ కూడా 32 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. న‌మీబియా బౌల‌ర్ల‌లో డేవిడ్ వెయిస్‌, జాన్ ఫ్రైలింక్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన న‌మీబియా 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి 144 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. న‌మీబియా బ్యాట్స్‌మెన్‌ల‌లో డేవిడ్ వెయిస్ 43 ప‌రుగులు, క్రెయిగ్ విలియ‌మ్స్ 40, స్టీఫ‌న్ బార్డ్ 29 ప‌రుగులు చేశారు. పాక్ బౌల‌ర్ల‌లో హ‌స‌న్ అలీ, ఇమాద్ వసీం, హారిస్ రౌఫ్‌, షాదాబ్ ఖాన్‌లు త‌లా 1 వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి