శనివారం, జూలై 25, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : పాక్ చేతిలో భారత్ చిత్తు.. ఇజ్జత్ పోయింది..

T20 World Cup 2021 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్థాన్ తో భార‌త్ మ్యాచ్ అని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భార‌త్…

T20 World Cup 2021 : పాక్ చేతిలో భారత్ చిత్తు.. ఇజ్జత్ పోయింది..

T20 World Cup 2021 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్థాన్ తో భార‌త్ మ్యాచ్ అని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భార‌త్ ఎల్ల‌ప్పుడూ పైచేయి సాధించి తిరుగులేని ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చింది. క‌నుక ఈ మ్యాచ్‌లోనూ గెలుస్తుంద‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేశారు. ఉద‌యం నుంచి మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ వారు ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. భార‌త్‌ను పాక్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ ఘ‌న విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 pakisthan won by 10 wickets against india in 16th match

పాకిస్థాన్‌ను నిలువ‌రించడంలో భార‌త బౌల‌ర్లు పూర్తిగా విఫలం అయ్యారు. పాక్ ఓపెనర్లు మొద‌టి ఓవ‌ర్ నుంచే అటాక్ ప్రారంభించారు. దాన్ని చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించారు. దీంతో భార‌త్ నిర్దేశించిన 152 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.5 ఓవ‌ర్ల‌లోనే వికెట్ కోల్పోకుండా ఛేదించారు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో భార‌త్ దారుణంగా ఓట‌మి పాలు కావ‌డంతో మ‌న ఇజ్జ‌త్ మొత్తం పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు.

ముందు నుంచీ పాక్ ప్లేయ‌ర్లు ఎంతో ధీమాగా ఉన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్ర‌మంలోనే పాక్ బౌల‌ర్ షాహిన్ అఫ్రిది భార‌త జ‌ట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. త‌రువాత మిడిలార్డ‌ర్ అయినా ఆదుకుంటుంద‌నుకుంటే.. వారు కూడా విఫ‌లం అయ్యాడు. దీంతో కెప్టెన్ కోహ్లి, వికెట్ కీప‌ర్ పంత్‌లు కొంత‌సేపు క్రీజులో నిల‌బ‌డి ఆ మాత్రం స్కోరున అయినా భార‌త్‌కు అందించ‌గ‌లిగారు. లేదంటే భార‌త్ కు ఇంకా దారుణ‌మైన ప‌రాజ‌యం వ‌చ్చి ఉండేది. ఏది ఏమైనా.. ఈ మ్యాచ్ అనంత‌రం భార‌త అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్ర‌హ జ్వాల‌లతో రగిలిపోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి